సొరంగం తవ్వకాలపై ఎన్‌జిఆర్ఐ నివేదిక

– సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్‌జిఆరఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ శుక్రవారం సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్‌జిఆర్ఐ సంస్థను అభినందించడంతోపాటు ఎస్ఎల్‌బిసి పునరుద్ధరణ పనుల పురోగతితోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో బాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు ఎన్‌జిఆరఐ ఆధ్వర్యంలో భూపరిశోధన(సాయిల్ టెస్ట్) భాగస్వామ్యం కావాలన్నారు. శుక్రవారం ఈ మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈఎన్‌సి రమేష్‌బాబు సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా, ఎన్‌జిఆరఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌జిఆరఐ రూపొందించిన నివేదికపై అయన మాట్లాడుతూ ఎసఎల్‌బిసి సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఎన్‌జిఆరఐతో సమగ్రంగా సర్వే నిర్వహినట్లు తెలిపారు. తవ్వకాల సమయంలో ముందస్తుగా ప్రమాదవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ సీస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వివరించారు.సొరంగ మార్గం తవ్వకాలలో కార్మికుల భద్రతను ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకుందన్నారు. ఎన్‌జిఆరఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటాయన్నారు. ఎన్జీఆరఐ నివేదికలో స్ట్రెస్ జోన్‌లు, నీటి ఊరటలతోపాటు సొరంగమార్గంపై భాగం తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం జరిపారని తెలిపారు. ఎస్ఎల్‌బిసి పనుల పునరుద్ధరణ పై ఆయన మాట్లాడుతూ వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ లోడర్లు, భారీ డంపర్ల తోడ్పాటుతో ఇప్పటివరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తి అయిందన్నారు. దేశీయ, అంతర్జాతీయంగా సంస్థల నుండి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి రెండు వైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *