బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పాల‌న‌లో ప‌డ‌కేసిన అభివృద్ధి

– మోస‌పూరిత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడండి
– దీప‌క్‌రెడ్డిని గెలిపించండి
– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్  పార్టీల మోసపూరిత పాలనకు పూర్తి ముగింపు పలకబోతున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు అన్నారు.  శ‌నివారం జూబ్లీ హిల్స్ ప్ర‌చారంలో భాగంగా వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న మాట్లాడుతూ గ‌త‌ ప‌దేళ్లుగా  బీఆర్ ఎస్‌ పాలనలో మరియు ఇప్పటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింద‌న్నారు. ఇంత భారీ స్థాయిలో సభకు తరలివచ్చిన ప్రజల స్పందన చూస్తుంటే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ  విజయం ఖాయమని స్పష్టంగా కనిపిస్తోంద‌న్నారు. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో, ప్రజల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండింది. గత బీఆర్ ఎస్‌పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడటం లేదు. బస్తీల్లో, కాలనీల్లో అవ్యవస్థ  మురుగు నీటితో నిండిపోయిన డ్రైనేజీలు, తెరచి ఉన్న మాన్‌హోల్‌ల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలు, చిన్న వానకే నదుల్లా మారే రోడ్లు ఇలాంటి దారుణ పరిస్థితులకు కారణం బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీలే. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌, ప్రస్తుతం అదే శాఖను తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి భాగ్యనగరాన్ని దారుణ స్థితికి నెట్టేశారన్నారు. గత 23 నెలల పాలనలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన‌ 420 హామీలలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేద‌న్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్,  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. హైదరాబాద్‌ను “విశ్వనగరం” చేస్తామన్నారు — కానీ వాస్తవానికి “విషాదనగరంగా” మార్చేశారు. హైదరాబాద్‌లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైంది. అందుకే అభివృద్ధి బీజేపీ  ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ  అభ్యర్థి లంక దీపక్ రెడ్డిని  గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page