యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 4: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పురస్కరించుకుని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున గడప గడపకూ ప్రచారంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మంగళవారం పాల్గొన్నారు. రెహమత్ నగర్, బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఉన్న ఆరు బూత్‌లలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరును కలసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిసూ ఓటును అభ్యర్థిస్తున్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి స్థానికుడు, అందరివాడు అయిన నవీన్ యాదవ్‌ను గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





