జూబ్లీహిల్స్‌లో మంచి మెజారిటీతో గెలవబోతున్నాం 

– మంత్రి పొంగులేటి సమక్షంలో భారీగా కాంగ్రెస్‌లో చేరికలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అనవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధించబోతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రెహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఓమ్‌ నగర్‌ చర్చి కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం మంత్రి పొంగులేటి సమక్షంలో రోడ్‌ సేఫ్టీ అధారిటీ ఛైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి మంత్రి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో గత 23 నెలల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్‌ పార్టీకి విజయాన్ని చేకూర్చిపెడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌కు మంచి మెజారిటీతో విజయం తధ్యమని అన్నారు. ఇప్పటికే ఈ డివిజన్‌లో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు, ఆటో యూనియన్‌ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్నారు. త్వరలో మరికొంతమంది చేరనున్నారని తెలిపారు. పదేళ్లలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఒక్క రేషన్‌ కార్డుకూడా ఇవ్వలేని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. 22 నెలల్లోనే ఈ నియోజకవర్గంలో అర్హులైన 14వేల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని, అలాగే సుమారు 8వేల మంది పేర్లను కార్డులలో చేర్పించామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page