రాష్ట్రంలో నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా

  • పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు
  • విద్యుత్ చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటు వేగ‌వంతం చేయాలి
  • భ‌విష్య‌త్ విద్యుత్ డిమాండ్‌పై ప్రొయాక్టివ్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం
  • దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

బెంగ‌ళూరు,  మే 24: రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu ) వెల్ల‌డించారు. శుక్రవారం బెంగళూరులో కేంద్ర విద్యుత్ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో ఆయ‌న విద్యుత్ రంగ అభివృద్ధిపై అనేక అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్ర పురోగతి మరియు ప్రణాళికలను వివరిస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, నిర్వ‌హ‌ణ సామర్థ్యాన్ని పెంచడం, మరియు పరిశుభ్ర ఇంధన మార్గంలో వేగంగా సాగేందుకు తగిన కార్యాచరణపై రాష్ట్రాలు మరియు కేంద్రం కలసి చర్చించడానికి ఈ సదస్సు విలువైన వేదికగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

విద్యుత్ రంగ అభివృద్ధికి సంబందించి ఆయ‌న వివ‌రించిన అంశాలీవిధంగా వున్నాయి.  రాష్ట్రంలోని అంతర్గత విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌కి తగిన విధంగా మరియు వివిధ విద్యుత్ వనరుల సమన్వయానికి అనుకూలంగా చర్యలు చేప‌డుతున్నారు. తెలంగాణలో ప్రసార లైన్లు మరియు ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యంలో గణనీయమైన విస్తరణపై ప్రణాళికలను ఈ సందర్భంగా వివరించారు. 2034-35 వరకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం కూడా చర్చకు వచ్చింది.  విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే వ్యూహాలపై చర్చ జరిగింది. సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలను తగ్గించడం, విద్యుత్ రంగ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం తద్వారా పెట్టుబడులకు మరియు నిరంత‌ర సేవల‌కోసం చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టారు. 

ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సదస్సులో చర్చించారు. ఛార్జింగ్ స్టేషన్లకు కనెక్షన్ ప్రక్రియను సులభతరం చేయడంపై తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థ అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించారు.  విద్యుత్ గ్రిడ్‌లో సైబర్ భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందన సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు చర్చించారు. ఏ పరిస్థితుల్లోనైనా నాణ్యమైన మరియు నమ్మదగిన విద్యుత్ సరఫరా నిర్ధారించేందుకు బలమైన వ్యవస్థలు అవసరమన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్న ప్రొయాక్టివ్ దృష్టికోణాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.  పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచే ప్రణాళికలపై కూడా వివరించారు. రాష్ట్రాలు మరియు కేంద్రం కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ఇంధన లక్ష్యాలను సాధించవచ్చన్న విషయం ఈ సదస్సులో స్పష్టమైంది. సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కే.జే జార్జ్, తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page