హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పోక్సో కేసు నమోదు అయిన విషయం విదితమే. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో పలు సెక్షన్లను పోలీసులు జోడించారు. బాధితురాలి నుంచి రెండోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (తి)ను కూడా పోలీసులు జతపరిచారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ గురువారం విచారణ జరపనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





