లలితా మహా త్రిపుర సుందరిగా భద్రకాళి

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో దేవీ శర న్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం అర్చకులు నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని లలితా మహా త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు జరిపారు. ఉద
యం పల్లకీ సేవ, సాయంకాలం శేష వాహన సేవ జరిపారని ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. గురువారం కార్యక్రమాలకు వాగ్దేవి విద్యాసంస్థల అధినేతలు చందుపట్ల దేవేందర్ రెడ్డి – వాణీదేవి, వాహినీదేవి, కళా సారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అధినేతలు పింగిళి పవన్ రెడ్డి శ్రీలత, పల్లె లక్ష్మిణావుగౌడ్ సువర్ణ ఉభయదాతలుగా వ్యవహరించారు. ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం, మధ్యాహ్న భోజ నం ఏర్పాట్లను ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. భక్తులందరికీ శ్రీ భద్రకాళీ సేవా సమితి కన్వీనర్ అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం, రాత్రి అశేష అన్నదానం నిర్వహించారు. సాయంకాలం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను అలరించాయి.

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం 

దేవాలయ ప్రాంగణంలో ధర్మకర్తల మం డలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వరంగ ల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో ఈఓ రామల సునీత పర్యవేక్షణలో దేవాలయ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలుగా కమటం వేణు గోపాల్, కల్లూరి పవన కుమార్, కటకం రాములు, కారెంగుల సురేష్ బాబు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, చిదర అంజనీదేవి, మాడిశెట్టి సతీష్, పేరాల శ్రీనివాసరావు, రమేష్ చందర్ భంగ్, చింతలపణి వాసవి రెడ్డి, మోతుకూరి మయూరి ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నర్సింహ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *