వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్లులోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు రెండవ రోజు సోమవారం ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించిన తదుపరి అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించినట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. సోమవారం కార్యక్రమాలకు ఉభయదాతలుగా సూర్యకుటీర్ అధినేతలు తంగ ళ్ళపల్లి తిరుమలాదేవి సంపత్ కుమార్, హర్షవర్ధన్ డాక్టర్ మానస దంపతులు, కుమారి వైష్ణవి, బైరి రవికృష్ణగౌడ్ సరోజన, హరి కృష్ణ-హరిత దంపతులు, ఊడుగుల సాయికిరణ్-డాక్టర్ హర్షిత దంపతులు, గీతాభవన్, రాఘవేంద్ర టిఫిన్స్ హెూటల్స్ అధినేతలు బాలచంద్రహో ళ్ళ- రేణుక దంపతులు, చంద్రశే ఖర శెట్టి- జ్యోతి దంపతులు, కొప్ప నాగరాజశెట్టి -ప్రభావతి దంపతులు, అన్నపశె ట్టి- హేమ దంపతులు, సందీప్ దీవెశెట్టి- సమ్రత దంపతులు వ్యవహ రించా రు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, భక్తి సంగీతం, కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయని ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





