ఏఐసీసీ పరిధిలో కొండా సురేఖ వ్యవహారం

– అథిష్టానం తీసుకునే నిర్ణయం ఆందరికీ శిరోధార్యం
– కాంగ్రెస్‌లో వ్యక్తిగత  కోపాలకు తావు లేదు
– టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌

‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 27: ‌మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌ ఏఐసీసీ పరిధిలో ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపిన‌ట్ల టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కొండా సురేఖ అంశం కాంగ్రెస్‌ ‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై సురేఖ కూతురు సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దీనిపై సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వగా కుమార్తె వ్యాఖ్య‌ల‌కుతనను బాధ్యురాలిని చేయొద్దంటూ మంత్రి వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఉందని, అయితే అది క్రమశిక్షణకు లోబడి ఉండాలని ఆయ‌న‌ అన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌లోనే స్వేచ్ఛ ఎక్కువన్నారు. పార్టీలో ఎవరిపైనా కోపాలు, కక్షలు ఉండవని, కొండా మురళి తనతో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని మహేశ్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని చెప్పారు. బీసీలకు కాంగ్రెస్‌ ‌ఇచ్చినంత ప్రాధాన్యం ఏ పార్టీ ఇవ్వలేదన్నారు. ఇక  తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో రాజీ ఉండదని తేల్చిచెప్పారు.  ఏ రకంగానూ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తనకు ‘సర్‌’ ‌నోటీసు అందిందని, వివరాలు సమర్పిస్తానని మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *