పిల్లలతో జాగ్రత్తా ? లేదంటే ప్రమాదం !

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ ! వారిని వారి తల్లిదండ్రులు కొట్టరు,తిట్టరు,ఎన్ని చిలిపిపనులు చేసిన, చూసిచూడనట్లు వ్యవ హరిస్తారు. ప్రత్యేకంగా తం డ్రులకు వారీ పుత్ర సంతానంపై అమితమైన ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడ పరు కదా ! అదే కారణం కావొ చ్చు ! కాబోలు. తల్లి ఇంతో అంత భయంపెట్టిన,తండ్రి గారా బం మాత్రం కొంత ఎక్కువేనని చెప్పవచ్చు. కానీ అప్పుడప్పుడు పిల్లల కోసం భార్యాభర్తలు తగువులాడటం సర్వసాధారణమన్న విషయం అందరికి తెలిసిందే.ఇంకొక విషయమేమిటంటే పిల్లలకు సంవత్సరం దాటకముందు నుండే వారిని టీవీలకు అంకితం చేయడం లేదా మనదగ్గరున్నా స్మార్ట్ ‌ఫోన్‌ ‌లలో వీడియోలు చూపుతూ తినబెట్టడం మూలంగా, వారికి తినబెట్టాలంటే టీవీ లేదా ఫోన్‌ ‌తప్పనిసరిగా మారిపో యింది.

ఇది అందరింట్లో జరిగే తతంగమే. కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకవిషయమేమిటంటే పాశాలకు కూడా వెళ్లనివయస్సులో, అక్షరం ముక్కరా కున్నా స్మార్ట్ ‌ఫోన్‌ ‌పాస్‌ ‌వర్డ్ ‌తో ఓపెన్‌ ‌చేసి ఆపరేట్‌ ‌చేసేస్థితిలో ఉన్నారు నేటి చిన్నారులు. దీనంతటికి కారణం ఎవ్వరంటే ముమ్మాటికీ తల్లిదండ్రులని చెప్పక తప్పని పరిస్థితి.     రెండున్నర సంవత్సరాలకే వారి అల్లరిని భరించలేక పాఠశాలకు పంపిస్తారు. పలక, బలపం పట్టుకోవడానికి రానివయసులోనే పాఠశాలకు వెళ్ళి అక్కడ డీజీలతో కాలక్షేపంచేసి ఇంటికిరావడం,మళ్ళీ ఫోన్‌,‌టీవీలకే అంకితంకావడం సాధారణమైపోయింది.

తల్లిదండ్రులు సైతం వారివారిపనుల్లో తీరికలేకుండా గడపడం, ఉద్యోగరీత్యా ఇద్దరు సమ యం తీరికలేకుండా గడిపి అలసిపోవడమో,ఇతర ఏ పనుల్లో ఉండటం, తండ్రులు కాస్తా బయట ఎక్కువగా గడపడమో,మరీ తండ్రులకు మరే ఇతర కారణాలవల్ల పిల్లలతో ఎక్కువసమయాన్నీ గడపలేక పోతున్నారన్నది వాస్తవం.కనీసం నాన్నమ్మ, తాత య్యలతో గడపడానికి ఉద్యోగరీత్యా వేరే గ్రామాలలో లేదా పట్టణాలలో వేరుకాపురం పెట్టడం,ఏద్కెతేనేమి పిల్లలకు కథలు చెప్పడం, పూర్వం గురించి, భవిష్యత్‌ ‌గురించి మంచి మాటలు వినడానికి అదృష్టాన్నీ నేటిచిన్నారులు నోచుకోవడం లేదన్నది వాస్తవం.

గతంలో రాత్రి సమయంలో ఎనిమిది గంటలకల్లా భోజనం పూర్తిచేసుకోని, ఇంటి ఆరుబయట పడుకోని ఆకాశంవైపు చూస్తూ, నక్షత్రాల గురించి ఎన్నో కథలు అల్లి అందులో నీతిని భోదిస్తూ, ఐకమత్యం గురించి, మన సంస్కృతీ, సాంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి, పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఇలా ఎన్నో విషయాలను తెలియజేసేవారు. ఆనాడు పాఠశాలకు వెళ్లకపోయినా సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పేవారు.కానీ నేడు ఆ కథలు చెప్పేవారు అసలే లేరు, అక్కడక్కడా ఉన్నా పరిణా మక్రమం లోని మార్పువల్లో లేదా మరే ఇతర కారణాల ప్రభావం మూలంగా, పిల్లలు వినడానికి సిద్ధంగా లేరు పైగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తే వినకపోగా, తిరిగి వారే పలు సారంలేని పిచ్చికతలెన్నో చెప్పడం జరుగుతున్నది. వీటన్నింటి మూల ంగా వచ్చేతరానికి భవిష్యత్‌ ‌లో సక్రమంగా ఎలా నడుచుకోవాలో తెలియ జేయలేని పరిస్థితి దాపురిం చిందనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.

కనీసం పాఠశాలలోనన్నా ఏమైనా నేర్చుకుంటారనుకుంటే అక్కడా అన్నీ ర్యాంక్‌ ‌ల్ను,బట్టి చదువులు, ’సదువు చారెడు – బలపాలు దోసెడు’ అనే విధంగా తయారయ్యిందనడంలో నిజం లేకపోలేదు. ఇదిలానే కొనసాగితే సమాజానికి ఎలాంటి ఉత్పత్తి నిస్తున్నామో ! ఆలోచించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఎంత్కెనా ఉన్నది. ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి ఇక్కడ తల్లిదండ్రుల భయం,అక్కడా ఉపాధ్యాయుల భయం లేకుండా నేటి సాంకేతిక పరిజ్ఞానానికిలోన్కె, ఏం చేస్తున్నారో, వారి పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. కొంతమంది యువకులు  వృద్ధాప్యములోనున్న వారి తల్లిదండ్రులను అనాధాశ్రమాలలో ఉంచితే, ఇంకొం తమంది తమ పిల్లలకు నాణ్యతమైన విద్యనందిచడానికి పట్టణాలలో గల కార్పొరేటు పాఠశాల  వసతి గృహాలలో వుంచడమనేది, పిల్లలకు మరియు వారి నానమ్మతాతయ్యల ఎడబాటుకు దారితీ యడానికి  కారణం వారి తల్లిదండ్రులని చెప్పడంలో ఏలాంటి భయమక్కరలేదు.ఇలా జరగడం మూలంగా పిల్లలకు తెలియాల్సిన ముఖ్య విషయాలు వారికి చేరడం లేదన్నది సత్యం.ఇంకో విషయమే మిటంటే నేటి పరిస్థితులలో పిల్లలకు ఎవ్వరి భయం లేకపో వడమనేది క్రమశిక్షణ రాహిత్యానికి దారితీసి, చెడు సాహసానికి పురిగొల్పి పక్కదారిపట్టిస్తుంది. తరగతి గదిలో నలుగురు మంచి నడవడిక కలిగిన మిత్రులతో సాహసం చేస్తే చెడ్డవాడు సైతం మంచివాడిగా మారడానికి వీలవుతుంది.కానీ నలుగురు చెడ్డ వారితో సాహసం చేస్తే మంచివాడు సైతం వారిలా మారాల్సిందే.

నేడు పాఠశాల విద్యలోనే విద్యార్థులు వివిధ చెడు అలవాట్లకు బానిసలవు తున్నారు. గతంలో పట్టణాలు, నగరాలలో కాలేజీ విద్యార్థులను లక్ష్యం చేసుకోని కొన్ని ప్రైవేటు వ్యాపారులు విదేశాల నుండి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ‌ను తెప్పిం చుకోని విద్యార్థులకు అల వాటు చేసి ఆర్దిక పరమైన వ్యాపారం చేసేవారు. కానీ అదికాస్తా నేడు పాఠశాల స్థాయిదాకా రావడం బాధా కరం. ఇక్కడ ఇంకొక విష యాన్నీ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల నుండి ఇలాంటి పాఠశాలలో ప్రవేశించి ఇలాంటి దురలవాట్లకు అలవా టుపడి ఆ పాఠశాల నుండి తమ గ్రామంలోని పాఠశా లలో మళ్ళీ ప్రవేశిస్తే అక్కడి దురలవాట్ల రుచిని ఇక్కడి స్నేహితులకు తెల్పడం, చూయించడం అలా చిన్నచిన్న నగరాలకు కూడా వ్యాపించి పాఠశాల వయసులోనే విద్యార్థులు ఇలాంటి దురలవాట్లకు బానిసలుకావడం చాలా దురదృష్ట్యకరమైన విషయమని చెప్పకతప్పదు.

ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తల్లి దండ్రులకు వారి పుత్రరత్నాలు ఎలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో వున్నారు.వీటంతటికి కారణం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్‌ ‌మనీ అంటూ డబ్బులివ్వడం అడిగిందల్లా ఇప్పించడం, గార్వం ఎక్కువుగా పెట్టి, గుడ్డిగా నమ్మేయడం. ఎలాంటి నిఘాలు గానీ, తనిఖీలు గానీ చేయకుండా కనీసం ఏం చదువు తున్నాడు, జ్ఞానంలో ఏమైనా మెరుగైనాడా ! ఇంకేవన్నా సమస్యలున్నాయా అంటూ అరాతీస్తూ పరిశీలించడం లాంటివి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన పనులు.లేదంటే మనపిల్లలు మనకు దక్కని పరిస్థితులు వస్తున్నాయి. పాఠశాలలో సైతం ఉపాధ్యాయులు ఏలా ంటి చర్యలు  తీసుకోలేని పరిస్తితి ఎందుకంటే ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు అటు ప్రభుత్వాలు పిల్లలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా బోధించాలని నియమాలు పెట్టడం, పాఠశాల యాజమాన్యాలు సైతం విద్యార్థులు తప్పుజేస్తే అతనిపై చర్యలు తీసుకుంటే పాఠశాలకు ఎగనామం పెడతాడు.

అతను కట్టే ఫీజును కోల్పోతామనే ధోరణితో నియమాలు పెట్టి అనుసరిస్తూ విద్యార్థికి అనుకూ లంగా నడుచుకుంటూ వ్యహరి స్తుంది. అందుకే నేటి విద్యార్థులు అలా తయా రవ్వడానికి వీరు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా జరగరానిది జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులకే ఎక్కువ బాధ కలుగుతుంది. కావున చిన్నతనం నుండి పిల్లల పెంపక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే సమాజా నికి ఉత్తములను ఇచ్చినవాళ్ళమవుతాము. కానీ అతి ప్రేమ, గారాభం, పట్టించుకోకపోవడం లాంటివి అనుసరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కో వాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఈ విషయంపట్ల ఆలోచన చేసి సత్పలితాలనిచ్చే విధంగా పిల్లల తల్లిదండ్రులు పెంచడానికి ప్రయత్నించాలని ఆశిద్దాం.

image.png
డా.పోలం సైదులు

M.A.B.Ed.,Ph.D
9441930361

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *