– వివిధ కేడర్లలో ఉన్న 70మంది కూడా
– రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట లొంగుబాటు
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ గురువారం లొంగిపోనున్నారు. అందుకు రంగం సిద్దమయ్యింది. ఆయనతోపాటు మరో 70మంది వివిధ హోదాల్లో ఉన్న మావోయిస్టులను తీసుకురానున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయ్ ఎదుట వీరంతా గురువారం లొంగిపోనున్నారు.ఇప్పటికే కొన్ని రోజులుగా పోలీస్ ఉన్నతాధికారులతో టచ్‌లో ఉన్నతకెళ్ళపల్లి తన అనుసరవర్గం 70 మందితో లొంగిపోనున్నారు. ఆ తర్వాత వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 70మందిలో డివిజన్ కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ సభ్యులు ఈ లొంగుబాటులో ఉంటారు. ఆశన్నతోపాటు ఇప్పటికే 70 మంది మావోయిస్టులు ప్రత్యేక బస్సులలో జగ్దల్‌పూర్ చేరుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం రాత్రి జగ్దల్‌పూర్‌లోనే బసచేసి ఉదయం 11,12 గంటల సమయంలో ముఖ్యమంత్రి ఎదుట బృందం లొంగిపోనున్నారు. ఇప్పటికి లొంగిపోయిన వారిలో ఆశన్నని ఒక ప్రత్యేకమైన వ్యక్తి గా చూడవచ్చు. ఆశన్న కాకుండా ఉత్తర బస్తర్ ఇంచార్జ్‌గా ఉన్న ఎస్‌జడ్సీ సభ్యుడు రాజమన్ (తెలంగాణ వాసి), మాడ్ డివిజన్ ఇన్చార్జిగా ఉన్న రనిత (అబూజ్‌మాడ్ ఫస్ట్ రిక్రూట్)లు కూడా లొంగిపోతారని అంటున్నారు. వీరే కాకుండా ఈ రెండు డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ ఏరియా కమిటీల సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. రూపేశ్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్చార్జిగా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శాంతి చర్చలకు తమ పార్టీ సిద్ధమని చెబుతూ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆశన్న కూడా సోనూ వెంటే ఉన్నాడని, తను కూడా మరికొందరితో లొంగిపోతాడని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం లొంగుబాట కార్యక్రమం జరగనుంది.ఆ శన్న లొంగుబాటు మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టంగా పరిగణించవచ్చు. ఇటీవల మావోయిస్టు పార్టీలో జరుగుతన్న పరిణామాల దృష్ట్యా అగ్రనేతలు లొంగిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





