– అభిమానులకు సీఎం విజయ్ ఆదేశం
చెన్నై, మే 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) శ్రేణులకు ఆ పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీని స్థాపించామని తెలిపిన టీవీకే ప్రజలు ఇబ్బంది పడే పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్.ఆనంద్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. నాయకుల పుట్టిన రోజులు లేదా కుటుంబ వేడుకల సందర్భాల్లో వీధులు, బహిరంగ ప్రదేశాలు, జనసముహాం ఉన్నచోట లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఎలాంటి బ్యానర్లు, పోస్టర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. అంతేగాక ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎలాంటి వేడుకలు జరపకూడదని, ఒకవేళ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు పార్టీ ప్రకటించింది. ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించింది. తమిళనాడు అభివృద్ధి కోసం పయనిస్తున్న తరుణంలో ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని టీవీకే గట్టి హెచ్చరిక జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



