– ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్ యాదగిరిగుట్టలో విజయవంతంగా జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అఖిలపక్షాల నాయకులు పాల్గొన్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలను మూసివేయగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి బంద్‌కు సహకరించారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో నుంచి సుమారు 95 బస్సులు నడవాల్సి ఉండగా బస్సులను డిపోలకే పరిమితి చేశారు. బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





