– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం
– రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు
– గణాంకాలతో బదులిచ్చిన మంత్రి
హైదరాబాద్, మే 6: ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్నది పూర్తిగా దుష్ప్రచారమని, రైతుల్లో అయోమయం సృ ష్టించేందుకు బి.ఆర్.ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మంగళవారం -ఆయన మీడియా సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పూర్తి గణాంకాలను విడు దల చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ధాన్యం కొనుగోళ్ల పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని రైతులను అయో మయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పు డు ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. శాసనసభ, లో కసభ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కూడా బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కలుగ లేదని మండిపడ్డారు. భారతదేశం మొత్తంలోనే రికార్డ్ స్థాయిలో దిగుబడి కొనుగోళ్లు జరి పింది రాష్ట్రంలో ఈ రబీ సీజన్ లో 67 లక్షల ఎకరాలలో వరి సాగయింది. 141 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రానుంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభు త్వం సన్నద్ధం అయింది. ఇప్పటి వరకు ప్ర భుత్వం ధాన్యం 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు మొత్తం 2310 కోట్లు చెల్లించాం. రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు రూ.21 వేల కోట్లు కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ముందెన్నడూ లేని రీతిలో వసతులు కల్పించాం. అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసి పోకుంటా ఉండేందుకు గాను 2.63 లక్షల టార్బాలిన్స్, 18.75 కోట్ల గన్ని బ్యాగు లను అందుబాటులో ఉంచాం. రాష్ట్ర వ్యా ప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశాం. 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిం చేందుకు గాను 6,200 వాహనాలు ఉన్నా యి. కొనుగోలు కేంద్రాలలో రైతుల కోసం మంచి నీరు, ఓ.ఆర్.ఎస్ సరఫరా చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాలలో రైతులు చనిపోతే తక్షణమే పరిహారం అందిస్తున్నాం. కొనుగో లు కేంద్రాలలో ఉదయం, సాయంత్రం పూట కొనుగోలుకు ఆదేశాలిచ్చాం. ధాన్యం కొను గోలు కేంద్రాలలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
అన్నింటికీ మించి ధాన్యం కొనుగోలు అంశంపై ప్రత్యేకించి పౌర సరఫరాల శాఖా కేంద్ర కా ర్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చే శాం. వాతావరణంలో సంభవిస్తున్న మార్పు లను ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక మెకాని జం ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా ప్రత్యేక టోకెన్లు అందిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు రికార్డ్ స్థాయిలో జరిగాయి. 2023-24 బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 25 ఖరీఫ్ లో 8332 కేంద్రాలను ఏర్పాటు చేశాం. 2023-24 బి.ఆర్.యస్ ప్రభుత్వ హ యాంలో ఖరీఫ్ లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25 ఖరీఫ్ లో 53.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 2023-24 బి.ఆర్.ఎస్ పాలనలో నాటి ప్రభుత్వం ఖరీఫ్ లో కొనుగోలు చేసి న ధాన్యానికి 10,415 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024-25 ఖరీఫ్ లో 12,512 కొట్లు చెల్లించాం. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023-24 రబీలో 7178 కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసి 7 లక్షల 62 వేలమంది రైతుల నుండి 47.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 10549 కోట్లు రైతు లకు చెల్లించాం. 2024-25 రబీలో 8378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10 లక్షల 87 వేల మంది రైతుల నుండి 74.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 17198 కోట్లు రైతులకు చెల్లించాం. 2025-26 5 8448 5 కేంద్రాలు ఏర్పాటు చేసి 11లక్షల 65వేల మంది రైతుల నుండి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 17160 కోట్లు రైతులకు చెల్లించాం. ప్రస్తుత రబీలో 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13లక్షల మంది రైతుల నుండి రికార్డ్ స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని 21,501 కోట్లు రైతులకు చెల్లించెందుకు ప్ర భుత్వం సన్నద్ధంగా ఉందని అన్నారు. ఈ గణాంకాలు అన్నీ అధికారికంగా విడుదల చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





