హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గురువారం పార్టీ బీ-ఫామ్ అందుకున్నారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆయనకు బీ-ఫామ్ అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను, కేటాయించిన నిధుల వివరాలను, పథకాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దీపక్‌రెడ్డికి సూచించారు. అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ల అనైతిక స్నేహాన్ని ఎండగట్టాలని కూడా కోరారు. తద్వారా విజయం సాధిస్తామని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





