– కారు- ట్రక్కు ఢీకొనడంతో మంటలు
– నలుగురు సజీవ దహనం
జయపుర, అక్టోబర్ 16: రాజస్థాన్‌లో బార్మర్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో కారు ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారులో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గూడమలానీ తహసీల్‌లోని డాబర్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పని నిమిత్తం సింధారీకి వెళ్లారు. పని ముగించుకుని అర్ధరాత్రి దాటాక తమ స్కార్పియో వాహనంలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. గమ్యస్థానానికి ఇంకా 30 కి.విూ దూరంలో ఉండగా సింధారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదా గ్రామ సవిూపంలో మెగా హైవేపై ఎదురుగా వస్తున్న ఓ ట్రైలర్‌ను వారి కారు బలంగా ఢీకొంది. ఢీకొన్న వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఈ ఘటనలో మోహన్ సింగ్ (35), శంభు సింగ్ (20), పంచారామ్ (22), ప్రకాశ్ (28)లు మంటల్లో కాలిపోయి మరణించారు. కారు నడుపుతున్న దిలీప్ సింగ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





