– స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి
– వోకల్ ఫర్ లోకల్ బ్యానర్ ఆవిష్కరించిన రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రధాని నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ పిలుపునకు భారీ స్పందన లభిస్తోందని, స్థానిక ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడిరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమలదారులు, చేతివృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ప్రచారాన్ని ముమ్మరంగా తీసుకెళ్లేలా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ వోకల్ ఫర్ లోకల్ బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక చేతివృత్తుల వారు దేశంలో ఉన్నారు.. భువనగిరి హ్యాండ్లూమ్స్ వరల్డ్ ఫేమస్.. గద్వాల, నారాయణపేట్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో కూడా చేతితో తయారయ్యే వస్తువులు ఉన్నాయి.. కానీ వీటి కొనుగోళ్లు లేక ఉపాధి కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరగాలంటే స్వదేశీ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. మన దేశంలో తయారైన వస్తువులను స్థానికంగా కొనుగోలు చేయాలని, ఖాదీ, హ్యాండ్లూమ్ లాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారని రామచందర్‌రావు చెప్పారు. ‘వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్‘ నినాదంతో ఉత్పత్తులను ఎగుమతి చేసి విదేశీ మార్కెట్‌లో డిమాండ్ పెంచవచ్చనని సూచించారు. ఇది ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు.
లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం నిర్మూలన గురించి మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ వింగ్ ఎక్ట్రీమిజం నిర్మూలన చేయాలని ప్రకటించిందని, ఆ దిశలో ఆపరేషన్ కగార్ చేపట్టిందని రామచందర్‌రావు తెలిపారు. దీనివల్ల చాలామంది మావోయిస్టులు అడవులను వదిలి ఆయుధాలు అప్పగించి పోలీసుల ముందు లొంగిపోయారన్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ లొంగిపోయారన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరప్షన్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఎపిసోడ్‌లో ఇతర మంత్రుల, ముఖ్యమంత్రి అనుచరుల పేర్లు బయటపడుతున్నాయన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కరప్షన్ కొనసాగింది. ఇప్పుడు తెలంగాణలోనూ సెటిల్మెంట్లు, బెదిరింపులు, అవినీతి వంటి ఘటనల్లో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఆస్తులు, బినామీలు, అక్రమాల గురించి వివరణ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని, వారి డీఎన్‌ఏలోనే అది ఉందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకున్నదని, దోచుకున్న సొమ్మును పంచుకునే క్రమంలో దంచుకుంటున్నారు.. కొట్లాడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అమసర్థ, నిర్లక్ష్య పాలనలో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు అందడం లేదు.. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. పరిపాలన సక్రమంగా లేదు అని ఆరోపించారు. రాష్ట్ర, జూబ్లీహిల్స్ ప్రజలు దోచుకునే పార్టీలను తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేశారని, ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయంటూ దోచుకునే లీడర్లను, తుపాకీతో బెదిరింపులకు పాల్పడే కాంగ్రెస్ నాయకులను తిరస్కరించాలన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ వివాదంలో ఆమె కుమార్తె సుష్మిత చేసిన ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారాలు బయటపడ్డాయని, దీనిపై పూర్తి విచారణ జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని రామచందర్‌రావు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





