– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేదాకా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమే కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలనా అని ఆయన నిలదీశారు.విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతూ ప్రభుత్వం బారికేడ్ల వెనుక దాక్కుంటోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే అనుమతి నిరాకరించారని, అసెంబ్లీ వద్దకు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తే లాఠీలతో విరుచుకుపడటం అమానుషమని మండిపడ్డారు. విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, 22ఏ భూ దందాపై సమగ్ర విచారణ జరిపేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




