ప్రసంగం బాగుంది కానీ, పశ్చాత్తాపం లేదు!

అంత పెద్ద సభ, కెసిఆర్ గంభీర ప్రసంగం తరువాత, భారత్ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉనికికి, భవిష్యత్తుకి తిరుగులేని భరోసా దొరికినట్టు సంబరపడుతున్నారు. శ్రేణుల నుంచి బలప్రదర్శన, నాయకుడి నుంచి దిశానిర్దేశం దొరికాక, ఇక విజయానికి పరుగులు తీయడమే మిగిలిందని పార్టీ అభిమానులు, అనుకూల పరిశీలకులు నమ్మకం ప్రకటిస్తున్నారు. తటస్థులు, వ్యతిరేకులు…









