prajatantra_news

prajatantra_news

తేమ పేరిట ధరలో తేడా చేస్తే సహించం

– పత్తి కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ – మద్దతు ధర పెంపుపై పార్లమెంటులో రాహుల్‌తో కలిసి పోరాటం – గోల్‌ తండాలో సీసీఐ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణం,…

‘తెలంగాణ రైజింగ్‌-2047′ సర్వేకు విశేష స్పందన

– సమాచారం ఇచ్చిన 3 లక్షలమంది ప్రజలు – ఈనెల 25తో ముగియనున్న సర్వే హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 : రాష్ట్ర భవిషత్తు రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 సిటిజన్‌ సర్వేకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని…

పోలీసు సంక్షేమ నిధికి రూ.8 లక్షల విరాళం

– ఎలైట్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ట్రోఫీ విజేత పోలీస్‌ టీమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: చామల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎలైట్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ట్రోఫీని పోలీస్‌ క్రికెట్‌ టీం గెలుపొందింది. ఉప్పల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈనెల 9, 10 తేదీల్లో జరిగిన ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌లో టాలీవుడ్‌…

అదుపులేని బంగారం ధరలు

– తులం మరో రూ.3వేలు పెరుగుదల హైదరాబాద్‌, అక్టోబర్‌ 21: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర మంగళవారం దాదాపు రూ.3వేలు పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.1.34 లక్షలు దాటింది. అటు వెండి ధర కూడా కేజీ దాదాపు రూ.4వేలు…

ప్రజా సంక్షేమమే పోలీసుల లక్ష్యం

 – ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీఐ శంకర్‌ గౌడ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నారని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీిఐ శంకర్‌ గౌడ్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట…

వార్‌ బీజేపీ-మజ్లిస్‌ మధ్యే 

~ అభివృద్ధిలో విఫ‌ల‌మైన కాంగ్రెస్ ~ దీపక్‌ రెడ్డి నామినేషన్‌ సంద‌ర్భంగా పార్టీ చీఫ్‌ రామచందర్‌రావు – ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి మంగళవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలం…

అనూహ్యమైన ప్రగతి

– పనితీరులో దూసుకుపోతున్న హెచ్‌ఎండీఏ -వేగవంతంగా బిల్డింగ్‌, లేఔట్‌ల అనుమతులు – రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం – గత ఏడాది తో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు – 9 నెలల్లోనే 88 లక్షల చ.మీకు పైగా బిల్ట్‌ అప్‌ ఏరియాకు అనుమతి – ఫైళ్ళ పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్‌,…

జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి

– ఎన్నుకున్న పార్లమెంట్‌ టోక్యో, అక్టోబర్‌ 21: జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా అతివాద నేతగా పేరున్న సనే తకైచి జపాన్‌ పార్లమెంట్‌ మంగళవారం ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ…

‘ఆపరేషన్‌ సిందూర్‌’కు రాముడే స్ఫూర్తి

– ఆయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత రెండో దీపావళి – ప్రజలకు దీపావళి శుభాకాంక్షలతో ప్రధాని మోదీ లేఖ న్యూదిల్లీ, అక్టోబర్‌ 21: ’అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి.. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు.. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చాడు.. ఆపరేషన్‌ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర…

పోలీసుల రుణం తీర్చుకోలేనిది

– వారంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా – దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసు శాఖ – ఘనంగా పోలీస్‌ ‘ఫ్లాగ్‌ డే’ – విధి నిర్వహణలో అమరులైనవారికి సీఎం శ్రద్ధాంజలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా వెనుకడుగు వేయని సమాజ సేవకుడు పోలీస్‌ అని,…