Prajatantra News 1

Prajatantra News 1

సమగ్రశిక్ష ఉద్యోగుల నిర్బంధం హేయమైన చర్య

టెంట్లు పీకేయడం కాదూ…సమస్యకు పరిష్కారం చూపండి సిఎం సందర్భంగా పోలీసుల చర్యపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: సమస్యలను పరిష్కరించాలంటూ మెదక్‌లో నిరసన చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడమే కాకుండా సిఎం పర్యటన సందర్భంగా ఉద్యోగులను నిర్బంధించడంపై మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే…

రాష్ట్రంలో… కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని, వివిధ రంగాలలో విస్తరించి ఉన్న విభిన్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని తెలిపారు. రాష్ట్రం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యాక్రమాలతో తెలంగాణ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2023-24లో 15,623 మెగావాట్ల నుంచి 2027-28లో 20,968 మెగావాట్లకు, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని తెలిపారు. విద్యుత్‌ అవసరాలు 2023-24లో 85,644 మిలియన్‌ యూనిట్ల నుంచి 2027-28 లో 1,15,347 మిలియన్‌ యూనిట్లకు, 2034-35లో 1,50, 040 మిలియన్‌ యూనిట్లకు చేరుకుం టుందని అంచనా వేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. తెలంగాణ రాష్ట్రం 2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, వొచ్చే జనవరి 3వ తేదీన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో పలు భాగస్వాములతో సమావేశం నిర్వహిం చనున్నట్టు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.

2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక శక్తి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 25: హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి, తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన…

మెదక్‌ చర్చికి..దేశంలో ప్రత్యేక గుర్తింపు

పనికి ఆహార పథకానికి మెదక్‌ చర్చే స్ఫూర్తి  ఈ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం    కరువు, కాటకాలు నిర్మూలించడానికి చర్చి నిర్మాణం  క్రిస్టమస్‌ వేడుకలు, మెదక్‌ చర్చి వందేళ్ల వేడుకల్లో  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి  చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : మెదక్‌…

మెదక్‌లో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

Caste census

మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లి ఏడుపాయ దుర్గా భవాని అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 192 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మెదక్‌ నియోజకవర్గంలో…

ఈవీఎంలపై ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరించాలి

The Election Commission should act transparently on EVMs

ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్‌ పత్రాలను ప్రవేశపెట్టాలన్న పిటిషన్‌ను జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం గత ఏప్రిల్‌లో తిరస్కరించిన సంగతి  తెలిసిందే.  అయితే.. ఇటీవల సుప్రీంకోర్టులో ఈవీఎంలపై మరో వ్యాజ్యం దాఖలయి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. దీనిపై జనవరి 20వ తేదీతో ప్రారం భమయ్యే వారంలో విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌…

డిటెన్షన్ విధానం విద్యా వివక్షతకు దారితీస్తుంది !

Detention system leads to educational discrimination!

బడికి వొచ్చిన పిల్లలందరికీ చదువులు నేర్పే బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా నేర్చుకునే బాధ్యతను పిల్లల పై మోపడమే డిటెన్షన్ విధానం . పరీక్షలు పెట్టి పిల్లలను అదే తరగతిలో కూర్చోబెట్టడం అంటే ఒక రకంగా పిల్లలను బడి నుండి వెలివేయడమే. రెండవ అవకాశం ఇచ్చినా పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అదే తరగతిలో కొనసాగడం చాలా…

మేడిగడ్డపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులు కొట్టివేత

Bhupalappalli court order on Medigadda set aside

విచారణ జనవరి 7కు వాయిదా హైకోర్టులో కెసిఆర్‌, హరీష్‌ రావులకు ఊరట హైదరాబాద్‌, డిసెంబర్‌24 (ఆర్‌ఎన్‌ఎ): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. విచారణ…

స్థితప్రజ్ఞుడు వాజ్‌పేయి

సుస్థిర పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించేది బిజేపినే.. శతజయంతి ఉత్సవాల్లో మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తన స్థితప్రజ్ఞతతో దేశానికి సుస్థిర పాలన అందించారని బిజెపి సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు…

మానవత్వమే యేసు చూపిన మార్గం: డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికిమార్గ దర్శకంగా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.  విశ్వ మానవులకు ప్రేమ సౌభా తృత్వం పంచిన యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయని అన్నారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా  క్రైస్తవులకు…

విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో క్రిస్టియన్‌ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. క్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. ఏ నేరం చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని ప్రభువును వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది యేసు క్రీస్తు అని కేసీఆర్‌ కొనియాడారు. పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గమన్నారు. విశ్వశాంతిని కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒక్కరికీ యేసు బోధనలు అనుసరణీయమని అన్నారు. ద్వేషంతో నిండిపోతూ రోజు రోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని కేసీఆర్‌ తెలిపారు. గంగా జమున సంస్కృతి ఫరిడవిల్లేలా, మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరించి చూపిందన్నారు. పదేండ్ల బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో క్రిష్టియన్‌ మైనారిటీలకు ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, పలు కానుకలను అందిస్తూ క్రిస్మస్‌ పర్వదినాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని కేసీఆర్‌ గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత  కెసిఆర్‌ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో క్రిస్టియన్‌ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.…