హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికిమార్గ దర్శకంగా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విశ్వ మానవులకు ప్రేమ సౌభా తృత్వం పంచిన యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు ఆయన శుభాకా ంక్షలు తెలిపారు. అన్ని మతాల సారాంశం మానవత్వ మేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు.
శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాలని అన్నారు. ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుందని తెలిపారు. అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందని, క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయనస్పష్టం చేశారు. . క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు