deccan.com

deccan.com

‘ఎన్‌కె సమగ్ర రచనలు’

1970ల నుంచి 1990ల దాకా తెలుగు సీమ అంతటా విప్లవ గాయకుడుగా, కవిగా సుప్రసిద్ధుడైన ఎన్‌కె (ఎన్‌కె రామారావు) భౌతికంగా మన నుంచి దూరమై ఇవాళ్టికి పది సంవత్సరాలు. ఆయన జీవిత కాలంలో ఒక కవితా సంపుటం, ఒక దీర్ఘ కవిత, ఒక ఆత్మకథాత్మక రచన ప్రచురించాడు గాని అనేక ఇతర రచనలు పుస్తకరూపం ధరించకుండానే…

జిఎస్టీ బాదుడు ఇక ఆగేలా లేదు!

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి. ఇటీవలి సమావేశాలు కూడా అలాగే ముగిశాయి. ఇందులో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉందో, విపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది. అంబేడ్కర్‌కు అవమానం అంటూ కాలయాపన చేసి సమావేశాలను ముగించారు. ఇకపోతే అధికార పక్షాన్ని నిలదీసే క్రమంలో విపక్షాలు ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరించాయి. తమ ధోరణిలోనే పోరాటాలు సాగిస్తున్నాయి. ఇందులో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టామన్న ఆనందం కోసం చేస్తున్నదే తప్ప మరోటి కాదు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, జిఎస్టీ వాతలు, రూపాయి పతనం, ద్రవ్యోల్బణం వంటి విషయాల్లో అధికార పక్షాన్ని నిలదీయలేకపోయారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాలను చర్చించడం లేదు. చర్చించాలన్న ఆసక్తి అధికార, విపక్షాలకు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే..అల్లు అర్జున్‌పై కేసు గురించి మాట్లాడుతున్న బిజెపి నేతలు ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదు. కాంగ్రెస్‌ పాలనపై విమర్శలుచేస్తున్న బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలు తమ డొల్ల గురించి మాట్లాడడం లేదు. రాష్ట్రానికి ఏద్కెనా మంచి చేయాలన్న ఆలోచనతో లేరు. మోదీ అధికారం చేపట్టాక గత దశాబ్దకాలంగా ధరలు, పన్నులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు భారతీయులను అతలాకుతలం చేస్తున్నాయి. మోదీ అధికారం చేపట్టాక ధరలు, జిఎస్టీ, నిరుద్యోగం వంటివన్నీ దాడి చేస్తున్నాయి. అన్నదాతలు ఆగం అవుతున్నా పట్టింపు లేదు. అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి. కేవలం అధికారం కోసం పోరాటం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి. విపక్షనేత రాహుల్‌ గాంధీకి దేశ సమస్యలపై పెద్దగా అవగాహన లేదు. దీంతో ఆయన కేవలం పత్రికా ప్రకటనలు, పోజులకే పరిమితం అవుతున్నారు. అందుకే పార్లమెంటులో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. వీరికి తగిన మార్గనిర్దేశనం చేసేవారు కూడా లేకుండా పోయారు. అందుకే తదుపరి అధికారం లక్ష్యంగా కాంగ్రెస్‌ తన పోరాట లక్ష్యాలను అమలు చేస్తోంది. కేవలం మోధీని లక్ష్యంగా చేసుకుని మాత్రమే కార్యాచరణ ఉంటోంది. ఇందుకు ప్రతిపక్ష పార్టీల నేతలంతా తానా అంటే తందానా అన్న చందంగా రాజకీయాలు సాగిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడగా దీనిని భావించాలి. ప్రతిపక్ష బాధ్యత సక్రమంగా, బలంగా ఉంటే అధికారపక్షాన్ని నిలదీయ వచ్చు. కానీ అలా జరగడం లేదు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలనే తీసుకుంటే విపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ, ఆవరణలోనూ చోటు చేసుకున్న సంఘటనలు సభ్యసమాజాన్ని విస్తుపోయేలా చేశాయంటే అతిశయోక్తి కాదు. అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాదు, ఈ ఆందోళనలు శ్రుతిమించి పార్లమెంటు ప్రాంగణంలో సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కొందరు గాయాలపాలు కావడం.. దరిమిలా పోలీసు స్టేషన్లకు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకోవడం చూసాం. వీరంతా మన ప్రతినిధులు అని చెప్పుకోవడానికి మనమంతా సిగ్గుపడాలి. ప్రజలకు మేల్కెన పాలన అందించేలా పార్లమెంటులో సమస్యలపై చర్చించాల్సిన ఎంపిలంతా ఆందోళనతో సమావేశాల విలువైన సమయాన్ని హరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ను కేంద్ర బిందువుగా చేసుకుని ఎవరికి వారు పైచేయి సాధించాలని పోటీపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో మాట్లాడుతూ అంబేడ్కర్‌ పేరును పదే పదే జపించే బదులు, దేవుడిని తలచుకున్నా ఏడేడు జన్మల స్వర్గప్రాప్తి లభించేదంటూ వ్యాఖ్యానించారు. ఇది అంబేడ్కర్‌ ను అవమానించడమేనని కాంగ్రెస్‌ సభ్యులు ఆ మరునాడు సభలో ధ్వజమెత్తారు. ఇందుకు అమిత్‌ షా క్షమాపణ చెప్పడంతోపాటు, రాజీనామా చేయాలని పట్టుబట్టడంతో గలభా మొదల్కెంది. అంతటితో ఆగని విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష సభ్యుల దాడిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు.. హోం మంత్రి ప్రసంగంలోని కొన్ని పదాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎదురుదాడి మొదలుపెట్టడంతో పరిస్థితి వేడెక్కింది. ఇక ఇంతటితో ఇది ఆగడం లేదు. అంబేడ్కర్‌కు అవమానమంటూ దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వారంపాటు ఉద్యమిస్తామని పేర్కొంది. నిజానికి నిర్మలా సీతారామన్‌ మరోమారు కొన్ని వస్తువులపై జిఎస్టీ వడ్డించారు. ఇన్సూరెన్స్‌ పథకాలపై జిఎస్టీ నిర్ణయాన్ని వాయిదా వేశారు. వీటిపై విపక్షాలకు కొంచెం కూడా చురుకు అంటడం లేదు. ఈ జిఎస్టీ వడ్డింపుల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జిఎస్టీ బాదుడు ఇక ఆగదన్న రీతిలో నిర్మలా సీతారామన్‌ నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో మోధీ పతనం దీంతోనే ప్రారంభం అయ్యిందని చెప్పవచ్చు. మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కొద్దిగా తమ రుచి చూపారు. జిఎస్టీపై చర్చించి ప్రజలపై భారం పడకుండా చూసుకోవాల్సిన మోదీ అలా ఆలోచించడం లేదు. దీనిని బ్రహ్మపదార్థంగా ప్రచారం చేసుకుంటున్నారు. 18శాతం వరకు జిఎస్టీ కారణంగా ప్రజలపై ప్రత్యక్ష భారం పడుతోంది. అంతిమంగా ప్రతి పన్నుకు ప్రజలే బాధితులు. ఇది వ్యాపారులపై భారం పడదన్న ఇంగితం లేని పాలకులు మనకు దాపురించారు. దీనిపై విపక్షాలు పోరాడడం లేదు. ఇన్సూరెన్స్‌లపై జిఎస్టీ బాదుడుపై ప్రస్తావించినా పట్టించుకోవడం లేదు. నిజానికి జిఎస్టీని సవిరీక్షించకుంటే హనుమంతుడి తోక లంకను తగులబెట్టిన చందాన, బిజెపి సామ్రాజ్యాన్ని జిఎస్టీ తగులబెట్టడం ఖాయం. ి -కందుల శ్రీనివాస్‌ (సీనియర్‌ జర్నలిస్ట్‌)

జిఎస్టీతోనే బిజెపి సామ్రాజ్యం పతనం ఖాయం   అన్నదాతలు ఆగం అవుతున్నా  పట్టింపు లేదు  అధికార పక్షం ఎంతగా నిర్లిప్తంగా ఉందో.. విపక్ష పార్టీలు కూడా అంతే నిర్లిప్తతో ఉన్నాయి.  కేవలం అధికారం కోసం తప్ప, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీలు కరువయ్యాయి… పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎప్పుడూ ..ఎలాంటి చర్చా జరగకుండా ముగుస్తున్నాయి.…

దేశపు మోహనం – మన్మోహనం

పుట్టింది పాత పంజాబ్‌లోని సిక్కుల కుటుంబం గడిపింది సాధారణ మధ్యతరగతి జీవనం తన విద్వత్తుతో విశ్వానికి సమాధానం మనసంతా జ్ఞానం నిండిన మాటల మౌనం దేశానికి స్వేచ్చనిచ్చిన ఆర్థిక పరిజ్ఞానం ప్రపంచీకరణకు బాటలు వేసిన ధీరత్వం ప్రధానిగా ప్రారంభించిన వంద రోజుల పని విధానం కేంబ్రిడ్జ్‌ నుండి కుగ్రామం వరకు తన ముద్ర వేసిన మహనీయుడుజి…

చరిత్ర శిఖరంపై మన్మోహనుడు!

Manmohan on the peak of history!

ప్లేటో తన రిపబ్లిక్‌ గ్రంధంలో ‘తత్వవేత్తలు పాలకులుగా ఉంటే ఒనగూరే ప్రయోజనాలను ఈ విధంగా చెప్పారు’ తత్వవేత్తలు సునిశిత మేధో శక్తిని, లోతైన  అవగాహనని, విజ్ఞతని కలిగి ఉంటారు, హేతువు, తర్కం, వాస్తవికతల ఆధారంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి వారి వ్యక్తిగత ప్రయోజనాలకు, దురాశకు కాకుండా, అవి అంతిమంగా ప్రజల విశాల ప్రయోజనాలకు తోడ్పడతాయి’.…

రాష్ట్రంలో అంతుచిక్క‌ని వాతావరణం

ఉష్ణోగ్ర‌తల్లో హెచ్చుత‌గ్గులు, అకాల వ‌ర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో…

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం : మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత‌ నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌…

ముగ్గురు పోలీస్‌ సిబ్బంది అనుమానాస్పద మృతి

మృతుల్లో ఎస్సై, మ‌హిళా కానిస్టేబుల్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు కామారెడ్డి జిల్లాలో కలకలం కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పోలీస్‌ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌…

శాంతిభద్రతల‌పై రాజీపడే ప్రసక్తే లేదు

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు,…

చిత్ర‌సీమ‌ను ప్ర‌పంచ‌స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దుదాం..

సినిమా ఇండ‌స్ట్రీ బాగుప‌డాల‌న్న‌దే మా ఆకాంక్ష తెలంగాణ అభివృద్ధిలో మీరూ భాగస్వాములు కండి షూటింగ్స్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు హైదరాబాద్ కు వొచ్చేలా చర్యలు డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న…

శ్రీతేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి..

బాలుడి ఆరోగ్యం మెరుగుప‌డుతోంది.. మాజీ మంత్రి హ‌రీష్‌ రావు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : సంధ్య థియేట‌ర్‌లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన శ్రీతేజ్ కోలుకుంటున్నాడ‌ని, వైద్యానికి స్పందిస్తున్నాడ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. గురువారం కిమ్స్ శ్రీతేజ్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ…