deccan.com

deccan.com

రాష్ట్రంలో 4.50 లక్ష ఇందిరమ్మ ఇండ్లు

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

40 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభం దమ్మపేట తాసిల్దార్‌ ‌కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో  విస్తృత పర్యట‌న‌ దమ్మపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26:‌ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణాల‌ను  ఈ సంక్రాంతి నుంచి ప్రారంభించి…

బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 26 : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాద‌న‌లు విన్న అనంత‌రం శ్రీనివాస్‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ.5 వేల పూచీక‌త్తు, ఇద్ద‌రి ష్యూరిటీల‌తో బెయిల్ మంజూరు చేసింది. విచార‌ణ‌కు…

బిఆర్‌ఎస్‌ ‌నేతలను ఊచలు లెక్కపెట్టించే యత్నం

గ‌త ప‌దేళ్లలో చేసిన త‌ప్పిదాల‌కు ఆధారాల సేక‌ర‌ణ‌.. అగ్ర‌నేత‌ల‌కు ఉచ్చులు బిగించే దిశ‌గా కాంగ్రెస్‌ మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్రతినిధి రాష్ట్రంలోని బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఒక్కొక్కరిని ఊచలు లెక్కపెట్టించే పనిలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉందేమోననిపిస్తోంది .తాజాగా బిఆర్‌ఎస్‌ ‌నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌ ఎ‌ర్రోళ్ళ శ్రీనివాస్‌ను జైలుకు పంపే యత్నాన్ని…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…

ఎక్కేకాడ పైలం… దిగేకాడ పైలం…!

Kothagudem Railway Station (BDCR)

 అడుగు పెట్టేందుకు హడలెత్తుతున్నారు  నత్తనడకన సాగుతున్న నాసిరకం పనులు  అమృత్‌ కాదు.. అంతా ఆగమాగమే..  ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే! కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: కొత్తగూడెం రైల్వే స్టేషన్‌(బిడిసిఆర్‌)లోకి ప్రవేశించగానే భద్రం కొడుకో ఎక్కేకాడ…దిగేకాడ… జర పైలం కొడుకో అన్న పాట గుర్తు చేసుకోవల్సిందే అని ప్రయాణికులు అంటున్నారు. కొత్తగూడెం రైల్వే…

టెక్నాలజీని బ్యాలెన్స్‌గా వాడుకోవాలి!

Technology should be used in balance!

టెక్నాలజీ అనేది  మనుషులను దూరం చేస్తోందా, బంధాలను బలోపేతం చేస్తోందా అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది. కానీ, మన చిన్న ప్రపంచాన్ని మాత్రం కొన్ని మైళ్ల దూరానికి తీసుకుపోతోంది. మునపటి తరానికి ప్రస్తుత తరానికి ఆలోచనలు, ఆచరణలో చాలా తేడా వుంది. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ అని…

అడుగడుగునా… విద్యలోనూ వివక్షతే…!

భారతీయ సమాజాన్ని వేల ఏళ్ల నాటి మను సంస్కతి నేటికీ పీడిస్తూనే వుంది. ‘స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే వుండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి’ అనే పురుషాధిక్య భావజాలాన్ని నేడు కూడా చలామణీ చేసేందుకు మనువాదులు యత్నిస్తున్నారు. దానికి నిదర్శనమే నేటికీ కొనసాగుతోన్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తోందో తెలుపుతూ.. ‘నువ్వు ఆడదానివి, గీత దాటకూడని దానివి, మచ్చపడితే మాయని దానివి’ అంటుందని చెబుతారు అబ్బూరి ఛాయాదేవి. ఈ మచ్చలు, గీతలు స్త్రీలకే గాని పురుషులకు లేవంటుందీ సమాజం. ఈ సమాజంలో అమ్మాయిలకు అడుగడుగునా అవరోధాలే.. వారి కదలికలపై ఎన్నో ఆంక్షలు, నిర్బంధాలు. పాప-బాబు, అమ్మాయి-అబ్బాయి, మహిళ-పురుషుడు అన్న ఈ పదాల మధ్య గీతలు చెరిపేసి, సమానం అని చెప్పాలనుకున్నా, పురుషాధిపత్య భావజాలం ఏదోఒక రూపంలో మొలకెత్తుతూనే వుంది. ఇంట్లో కనీసం ఒక్క మగపిల్లాడ్కెనా వుండాలని కోరుకునే భావన బలంగా వేళ్లూనుకుని వుంది. అమ్మాయిల్కెతే పెళ్లి తర్వాత అత్తవారింటికి వెళ్లిపోతారు, అదే అబ్బాయిల్కెతే వృద్దాప్యంలో తమను చూసుకుంటారని, అండగా వుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ, కొడుకు కంటే కూతురే నయమని అనుభవం చెబుతోంది. సమాజం అన్ని రంగాల్లోనూ మారుతున్నా అమ్మాయిలు- అబ్బాయిల పెంపకం విషయంలో మాత్రం పెద్దగా మారలేదు. కుటుంబానికి స్త్రీ పురుషుల ఇద్దరి అవసరం ఉంటుంది. బండికి రెండు చక్రాల వంటి వారు. కానీ సమాజం వారిని వేరు చేసి చూస్తూంది. ఈ తరహా విభజన ప్రాథమిక పాఠ్యాంశాల నుంచి సాహిత్యం వరకూ, సీరియళ్ల నుంచి సినిమాల వరకూ అబ్బాయిలకు ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే వున్నాం. విద్యలోనూ వివక్షతే. మగపిల్లలను బయట చదువులకు పంపించే తల్లిదండ్రులు ఆడపిల్లలను పంపడానికి సంకోచిస్తారు. ఎవరో ఒకరినే చదివించాల్సిన పరిస్థితివుంటే అబ్బాయిలకే ప్రాధాన్యతనిస్తారు. పిల్లల పుట్టుక దగ్గర నుంచి పెంపకం వరకూ ఈ వివక్ష అడుగడుగునా కొనసాగుతూనే వుంది. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే పిండ దశలోనే అంతమొందిస్తున్నారు. ‘జనాభా లెక్కల్లో స్త్రీలకంటే పురుషుల సంఖ్యే ఎక్కువ’ అని కేంద్ర ప్రభుత్వం గత వందేళ్లుగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా పురుషాధిపత్య భావజాల ఫలితమే. స్త్రీలను మగవారు తక్కవ చేసి చూడటం ఇంటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ముందు తల్లులు మారాలి. అమ్మాయిల పట్ల కఠినత్వం కాకుండా, మార్థవం అబ్బాయిల్లో జీర్ణించుకునేలా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. అమ్మాయి, అబ్బాయి సమానమేనన్న భావన ఇంటి నుంచి, చిన్న వయసు నుంచే మొదలవ్వాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. ఇంటర్నెట్‌ యుగంలో సోషల్‌విరీడియా, ఏఐ వంటి మాధ్యమాలు అందుబాటులో వున్న నేపథ్యంలో టీనేజ్‌ పిల్లల భావోద్వేగాలను నిశితంగా గమనిస్తుండాలి. ఒకవైపు కార్పొరేటీరణ, మరోవైపు మనువాదం నేర్పిన సనాతనధర్మం పురుష మెదళ్లలో చెత్తలా పేరుకుపోతోంది. ఈ చెత్తను తొలగించే బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పాఠశాలలో ఉపాధ్యాయులది. ఇంట్లో తల్లిని, చెల్లినీ గౌరవించడం నేర్పాలి. బయటి స్త్రీలకు కూడా అంతే గౌరవ మర్యాదలివ్వాలి. పాఠ్యాం శాల్లోనూ అమ్మాయి-అబ్బాయి సమానమన్న భావన పాదుకొల్పాలి. ఆ దిశగా అబ్బాయి లను పెంచాలి. వారి మానసిక వికాసానికి తోడ్పడాలి. వంట చేయడం, ఇల్లు తుడవడం వంటివి కేవలం అమ్మాయిల పని మాత్రమే కాదు, అబ్బాయిలూ నేర్వాలన్న విజ్ఞత తల్లిదండ్రులే నేర్పాలి. ఇంటి పనంటే ఇంతులది కాదని చెప్పాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయికీ అంట్లు తోమడం అలవాటు చేయాలి. అబ్బాయిల పెంపకంలో ఈ తరహా మార్పు అత్యవసరం. -మహేందర్‌ మిట్టపల్లి (సీనియర్‌ జర్నలిస్ట్‌)

భారతీయ సమాజాన్ని వేల ఏళ్ల నాటి మను సంస్కతి  నేటికీ పీడిస్తూనే వుంది. ‘స్త్రీ ఎప్పుడూ తండ్రి, భర్త, కొడుకు సంరక్షణలోనే వుండాలని, వేధించి హింసించే భర్తను కూడా పూజించాలి’ అనే పురుషాధిక్య భావజాలాన్ని నేడు కూడా చలామణీ చేసేందుకు మనువాదులు యత్నిస్తున్నారు. దానికి నిదర్శనమే నేటికీ కొనసాగుతోన్న లింగ వివక్ష. స్త్రీ పట్ల సమాజం…

మనోవర్తి అనేది మానవ హక్కుల్లో భాగమే!

చట్టాలను పటిష్టంగా రూపొందించాలి… కాలపరీక్షకు లోనవుతున్న వివాహ వ్యవస్థ   దేశ సర్వోన్నత న్యాయస్థానం మానవ సంబంధాలు, కటుంబ, వివాహ వ్యవస్థలపై  తరచూ తమ తీర్పులలో కీలక వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ జంటకు విడాకులు ఇచ్చే సమయంలో పెళ్లి బంధం గురించి సుప్రీంకోర్టు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య…

దామాషా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

 అల్లుడు వొస్తే ఇక అరుగుమీదనే ..! ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగులేకున్నా రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఆరునెలలుగా ఖాళీ గా ఉన్న చీఫ్ ఇంజనీరు పోస్టును ఎట్టకేలకు భర్తీ చేసారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కావాలని 80లక్షల మంది దరఖాస్తు…