– ప్రయాణికుల వాహనం బోల్తా
– 12మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
బాఘ్‌పత్, సెప్టెంబర్ 7 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బాఘ్‌పత్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ పికప్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ నుంచి 32 మంది ప్రయాణికులతో బదౌన్‌కు బయలుదేరిన పికప్ వాహనం,. సోమవారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో ఖేక్డా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ప్రమాదానికి గురైంది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఖేక్డా, బాఘ్పత్లోని కవ్యనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారని, ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మేల్కొనేలోపే వాహనం బోల్తా పడిందని క్షతగాత్రులు తెలిపారు. అయితే, వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్ పేర్కొంటున్నాడు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




