రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన మల్కాజిగిరి కమిషనరేట్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి.చరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి.ఆనంద్ రూ.కోటి బీమా చెక్కును అందజేశారు. మల్కాజిగిరి కమిషసరేట్ 2018 బ్యాచ్ కు చెందిన చరణ్ ఈగల్ ఫోర్స్ డిప్యూటేషన్ విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల అర్ధ రాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారా ష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కుడి కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించగా చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న హాస్పిటల్‌నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతిచెందినట్లు ప్రకటించారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు ఎస్బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





