– ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్
న్యూదిల్లీ, మే 16: సంచలనం సృష్టించిన ‘నీట్ ’ ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించి కేంద్రంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ’ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, అయినప్పటికీ ప్రధాని దీనిపై పెదవి విప్పడం లేదని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణం తొలగిస్తారా.. స్యయంగా ప్రధానమంత్రే ఇందుకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఇప్పుడే తొలగించండి అని ఆ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు. ‘నీట్’ కోసం రెండేళ్లపాటు 22 లక్షల మంది విద్యార్థులు రేయింబవళ్లూ కష్టపడ్డారని, వారి కఠోర శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందని అన్నారు. పరీక్షలకు రెండు రోజుల ముందే ‘నీట్’ పేపర్ వాట్సాప్‌లో లీక్ అయిన విషయం యావద్దేశానికి తెలుసునన్నారు. దీంతో తనకెలాంటి సంబంధం లేదని ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారని, ఆర్ ఎస్ఎస్, బీజేపీ, యూనివర్శిటీ అధికారుల కుమ్మక్కు వల్లే విద్యావ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా కాక సైద్దాంతిక అనుబంధాల ఆధారంగానే వైస్ చాన్సలర్ల నియామకాలు జరుగుతున్నాయన్నారు. వైస్ చాన్సలర్ కావడానికి ఎలాంటి సబ్జెÉక్ట్ నాలెడ్జ్ అవసరం లేదని, ఆర్ఎస్‌ఎస్‌కు చెందిన వారైతే చాలని ఆరోపించారు. ఈ విషయం యావద్దేశానికి తెలుసునని రాహుల్ అన్నారు. దేశంలో 80 సార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, రెండు కోట్ల మంది యువత భవిష్యత్తు నాశనమైందని లెక్కలు చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని మరోసారి డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



