స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు

– మల్కాజిగిరి ప్రాంతంలో 113 సెంటర్లపై పోలీస్‌ ‌దాడులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌మల్కాజిగిరి కమిషనరేట్‌ ‌పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్‌ ‌బృందాలు శుక్రవారం ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించాయి. దాదాపు 500 మంది పోలీసులు.. బృందాలుగా ఏర్పడి 113 స్పా సెంటర్లపై ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పలు స్పా సెంటర్లలో అక్రమాలతోపాటు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు నిర్దారించారు. కస్టమర్లకు సంబంధించిన డేటా రిజిస్టర్‌ను సైతం స్పా సెంటర్‌ ‌నిర్వాహకులు మెయింటెయిన్‌ ‌చేయడం లేదని గుర్తించారు. అలాగే స్పా సెంటర్లకు రెంటుకు ఇస్తున్న ఓనర్లను కూడా ఈ సందర్భంగా పోలీసులు విచారించారు. స్పా సెంటర్ల నుంచి రెంట్‌ ‌తీసుకోవడం తప్ప.. అందులో ఏం జరుగుతుందో కూడా ఓనర్లు పట్టించుకోవడం లేదని పోలీసుల విచారణలో బహిర్గతమైంది. కొన్ని స్పా సెంటర్లలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి కూడా.. ఇంటి ఓనర్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పోలీసులు గుర్తించారు. నగరంలోని స్పా సెంటర్ల భారీగా ఉన్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అడపాదడపా పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఆయా ఫిర్యాదుల మేరకు పోలీసులు దాడులు చేస్తున్నారు.  సందర్భంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ నగరంలో ఒకే సారి భారీగా స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేయడం ఇదే ప్రధమం.  అలాగే స్పా సెంటర్ల నిర్వహణ విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. పోలీస్‌ ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. స్పా ముసుగులో అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా.. వీటికి అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *