హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేప్టీ టీమ్ రట్టు చేసింది. సీతారాంబాగ్ ప్రాంతంలో విగ్నెట్ ఫుడ్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హెచ్ ఫాస్ట్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకు సంబంధించి కార్తీక్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ సంస్థలో రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేప్టీ టీమ్‌కు సమాచారం అందింది. దీంతో ఈ సంస్థపై ఆ టీమ్ దాడి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


