– బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం
– బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
మహబూబాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హా పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరమని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతోందని రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ డియా వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతికతతో పాటు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలన్నారు. శిక్షణా తరగతుల్లో చర్చించిన 12 అంశాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీజేపీ సిద్దాంతాలను ప్రజలకు చేరవేయాలని నేతలకు రాంచందర్‌రావు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.