– ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు
– గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.100 కోట్లు
– ఇప్పటికే 45 శాతం పనులు పూర్తి
– హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు
వేములవాడ, ప్రజాతంత్ర, జూలై 25 : దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2023 -24 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, 2024-25 బడ్జెట్‌లో రూ.100 కోట్లు విడుదలవగా శనివారం మరో రూ.99.40 కోట్లు విడుదల చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో సుమారు 45 శాతం పనులు పూర్తికాగా మరో రూ.99 కోట్లు విడుదల కావడంతో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు మరింత వేగంగా జరగనున్నాయి. కాగా, విధులు మంజూరుకు కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





