1. ప్రభుత్వ స్పందన మరియు చర్చలు : కొందరు ఈ ఆందోళనను ఆనాడు అన్నా హజారే నడిపిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ (అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం) ఉద్యమంతో పోల్చారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? అన్నా హజారే ఆందోళన ప్రారంభమైన నాలుగైదు రోజులకే అప్పటి ప్రభుత్వం ‘టీమ్ అన్నా’తో చర్చలు ప్రారంభించింది. కేంద్ర మంత్రులు, టీమ్ అన్నా సభ్యులైన అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడీలతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి అధికారిక చర్చలు జరిపింది.కానీ ప్రస్తుత మోదీ ప్రభుత్వ రాజకీయ వ్యూహం పూర్తిగా భిన్నమైనది. పౌర సమాజం నుండి వచ్చే ఇటువంటి బృందాలతో మనం ఎందుకు చర్చలు జరపాలి అని వారు భావిస్తారు. “మేమే ప్రభుత్వం, మాకు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు; మేము చేయాలనుకున్నది చేస్తాం” అనే ఆలోచనా విధానం వారిది. ఇది చాలా పెద్ద వ్యత్యాసం. నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అన్నా హజారేకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఉండకపోతే, బహుశా ఆ ఉద్యమం అంత పెద్దది అయ్యేది కాదేమో.
2. మీడియా కవరేజ్ : రెండో ప్రధాన వ్యత్యాసం మీడియా కవరేజ్. అప్పట్లో మీడియా కవరేజ్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో 24/7 ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్ కవరేజ్) ఇస్తూ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఈనాడు అలాంటి మీడియా మద్దతు లేదా కవరేజ్ లభించడం లేదు.
3. వెనుక ఉన్న రాజకీయ శక్తి , వ్యూహం : మూడోది, ఆనాటి ఉద్యమంలో రాజకీయ పార్టీలు వేదికపై ప్రత్యక్షంగా కనిపించకపోయినా, వెనుక నుండి మొత్తం ఉద్యమాన్ని నడిపాయి. ఆర్ ఎస్ ఎస్ , బీజేపీ వంటి సంస్థలు ఆ ఉద్యమం వెనుక ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ స్వయంగా నాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.కానీ ఇక్కడ జరుగుతున్న ఉద్యమానికి ఎటువంటి నిర్దిష్టమైన నిర్మాణం గానీ, నిర్వహణ గానీ లేదు. కొందరు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ఆందోళనలు చేయడం, వారితో యువత, ఏఐఎస్ఐ , ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాలు కలవడం జరుగుతోందే తప్ప… ఆనాడు అరవింద్ కేజ్రీవాల్ రూపకల్పన చేసినట్లుగా ఎలాంటి స్పష్టమైన, దృఢమైన వ్యూహం గానీ, వ్యూహకర్తలు గానీ ఇక్కడ కనిపించడం లేదు.
- -రాజదీప్ సర్దేసాయ్





