Tag special stories

జెర్రి తల నరికితే సరిపోతుందా?

ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే అది ఆ వ్యక్తి తప్పా, లేక లంచం ఇవ్వకపోతే పని జరగని వ్యవస్థదా? ఆ వ్యవస్థలోని ఏ ఒక్క ఉద్యోగినో పట్టుకుంటే అవినీతి అంతమవుతుందా? కెవి నరేందర్ రాసిన ‘జెర్రి’ కథ ఒక అవినీతి ఉద్యోగి జీవితంలో జరిగిన పరిణామాల ద్వారా ఈ ప్రశ్నలన్నింటినీ మన ముందుకు తెస్తుంది. కథ…

పొల్లు!: -బమ్మిడి జగదీశ్వరరావు

మెరుపు తీగెలు “వార్రావొచ్చు” అంది సుబ్బు. “ఆఁ?” అన్నాను. “తొందరగా యింటికి వెళ్ళాలి” సెల్‌లో టైమ్ చూసుకుంటూ కాస్తంత ఆందోళనగా అంది. నా మొద్దు బుర్రకి పరాకున అర్థం కాలేదు. “వారొస్తే, యెక్కడున్నా వొకటే… అయినా వారొస్తే గిస్తే ముందు బార్డర్లో వస్తుంది” అన్నాను. “వదినా, జోకులు వద్దు. ఆ వార్ కాదు మా వారు”…

సామూహిక సాహిత్య నిర్మాత

చెమ్మ: వారాల ఆనంద్ ‘‘అనాదిగా వెలి వేయబడ్డ నేను/ వెలిగించి అంధకారానందాన్ని తగలబెడుతున్నాను/ నా వెంట ఆత్మవిశ్వాసపు అన్నలు/ ఆత్మాభిమానపు అక్కలు/ పూలు మొగ్గలు నా సైన్యం’’ ఈ కవిత చదివితే జ్వలిత అంటే ఎవరో కవిగా తానేమిటో తెలిసిపోతుంది. సాహిత్యం కొన్నిసార్లు మనసుకు సాంత్వన ఇస్తుంది. మరికొన్నిసార్లు కలవరపెడుతుంది. ప్రశ్నలు వేస్తుంది. అలవాటుగా ఆలవోకగా…

ఆమె- అగ్నిపర్వతం

ఆ వేసవి సాయంత్రం శిఖరాంచున ఆమె ధ్యానముద్రలో ఉంది సుడులు తిరిగిన ఆమె నల్లటి కురులు నింగిని నేలను ఏకం చేస్తూ చీకటై…చిక్కటి నిశ్శబ్దమై …పరుచుకున్నాయి భావోద్వేగాలు జొరబడలేని ఎక్సోస్పియర్! శూన్యంగా ఉన్నంత మాత్రాన శాంతంగా ఉన్నట్లు కాదుగా .‌‌.. యుగాలుగా రాళ్ళ మాటున అణచి పెట్టిన ఒత్తిడి అగ్నిపర్వత గర్భాంతరాళాన్ని చీల్చుకుని బయటపడింది గుండె…

అన్నా హజారే , ప్రస్తుత ఆందోళనల మధ్య ప్రధాన వ్యత్యాసాలు

1. ప్రభుత్వ స్పందన మరియు చర్చలు : కొందరు  ఈ ఆందోళనను ఆనాడు అన్నా హజారే నడిపిన ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ (అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం) ఉద్యమంతో పోల్చారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? అన్నా హజారే ఆందోళన ప్రారంభమైన నాలుగైదు రోజులకే అప్పటి ప్రభుత్వం ‘టీమ్ అన్నా’తో చర్చలు ప్రారంభించింది. కేంద్ర మంత్రులు, టీమ్ అన్నా సభ్యులైన…

నిర్భయ స్వరం – కాళోజి

చెమ్మ : వారాల ఆనంద్ ‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు,  అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ…

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…

వియత్నాం నుంచి తిరుగు ప్రయాణం

“ఇలాంటి గెరిల్లా యుద్ధ పద్ధతులు అక్కడ చాలా ఉన్నాయి. అందువల్లనే అమెరికా సైనికులు భారీగా మరణించారు. ఫలితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం యుద్ధం విరమించినట్లు ప్రకటించింది. అప్పటినుంచి ఉండిపోయిన అమెరికన్లు, ఆ ప్రదేశంలో జరుగుతున్నంత సేపు వియత్నా మీస్ యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్య పోయాను. పలు యుద్ధాలను ఎదుర్కొని 1975లో స్వతంత్రాన్ని పొందిన వియత్నాం అతి కొద్ది సమయంలోనే వాళ్ళు సాధించిన సాంకేతిక, సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఫిదా అయ్యాను. శ్రమపట్ల వాళ్ళకున్న గౌరవం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళను ఈనాడు ముందంజలో ఉంచింది. ప్రస్తుతం అమెరికా వియత్నాం మిత్రదేశాలు.” గిరియానం – 1 హోచిమన్ నగరం వియత్నాం దేశానికి రాజధాని. దక్షిణ వియత్నాంలో ఉంది. వాతావరణం వెచ్చగా ఉంటుంది. పూర్వం ఈ నగరాన్ని సైగాన్ అని పిలిచేవాళ్ళు. సైగాన్ నదీ తీరంలో ఉండడం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. తరువాత కమ్యూనిష్టు నాయకుడు హోచిమన్ మీద గౌరవంతో ఆ పేరు స్థిరపడింది. ఈ నగర జనాభా 14 మిలియన్లు. ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం. హోచిమన్ అసలు పేరు న్గుయెన్ సీన్ కుంగ్. మే 19 తేదీన 1890 సంవత్సరంలో జన్మించాడు. సుమారు ఇరవై యేళ్ళ వయసులో దేశం విడిచిపెట్టి వెళ్ళి ‘ వియత్ మిన్ ‘ అనే సంస్థను స్థాపిం చాడు. ఫ్రాన్స్ , అమెరికా యుద్ధాలలో వియత్నాం విముక్తి కొరకు గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో పోరాటం చేసాడు. ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం అని రెండు భాగాలుగా ఉన్న వియత్నాంను ఏకం చేయాలని ఆయన ఆశయం. 1945 నుంచి 1969 దాకా ఉత్తర వియత్నాం అధ్యక్షుడుగా పనిచేసాడు. 1969లో మరణించాడు. ఆయన మరణించిన తర్వాతనే ఉత్తర దక్షిణ వియత్నాంలు 1975లో ఒకే దేశంగా రూపొందింది. ఈ విషయాలు గైడ్ చెర్రీ చెపుతున్నప్పుడు నాకు ప్రొ. జయశంకర్ గుర్తుకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు కలగన్న ఆయన మరణించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తొమ్మిది మంది బృందంలో నేను, పద్మ, అనురాధ వియత్నాం వార్ మ్యూజియం చూడడానికి వెళ్ళాం. ఈ మ్యూజియం ను 1975 లో ప్రారంభించారు. ఇది అమెరికా వియత్నాం యుద్ధానికి సజీవ సాక్ష్యం. బయటి ప్రాంగణంలో ఆ యుద్ధంలో ఉపయోగించిన ట్యాంకర్లు, విమానాలు ఉన్నాయి. వార్ మ్యూజియం…

కొన్ని సమయాల్ని దాటనివ్వాలి

నిజమైతే బాగుండనుకునే అర్థరాత్రి కలలోంచి అమాంతం ఉలిక్కిపడ్డ తాజా నిట్టూర్పువు నువ్వు… కూలిన కలల శిథిలాల్లో చిక్కుకున్న నవ్వుల్ని తలుచుకుంటూ విలపిస్తూ ఉండుంటావు, ఈ సమయాన్ని దాటనివ్వు. ప్రతిసారీ భోజనం సజావుగా సాగాలని లేదు, పరమాన్నపు రుచి ఘడియలున్నట్టే, పంటికింద రాయిలాంటి క్షణాలు ఉంటాయి, ఒకటాస్వాదించినట్టే, మరోటి ఆహ్వానించి తీరాలి..! 2) పరీక్షకొక ముందురాత్రి వెచ్చబడ్డ…