– ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి
న్యూదిల్లీ, ఆగస్టు 13 : దిల్లీలో 2025 నవంబరులో జరిగిన పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించినట్లు సమాచారం. దిల్లీలోని ఎర్రకోట సవిÖపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆల్‌ఖైదా ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థగా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల నుంచి మద్దతు, ఆశ్రయం లభిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో పలు ప్రాంతాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్ మరోసారి బలపడుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ సహా ఆయా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అల్‌ఖైదా ముప్ప్పుగా మారే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన కుట్ర, ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి నివేదికలోని అంశాలు కీలకంగా మారాయి. ఉగ్రవాద సంస్థల కదలికలను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దిల్లీ పేలుళ్ల కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే కొద్దీ ఈ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



