అజిత్‌ ‌రెడ్డికి మెట్రో అదనపు ఎం‌డీగా బాధ్యతలు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 27 : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజిత్‌ ‌రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ ‌తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న ఆయనను హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌లిమిటెడ్‌ అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఇన్వెస్ట్ ‌తెలంగాణ సీఈఓగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ అదనపు ఎండీగా కూడా అజిత్‌ ‌రెడ్డి విధులు నిర్వర్తించనున్నారు. అజిత్‌ ‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ అనంతరం తాజాగా ఆయనకు హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌లో కీలక అదనపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. ప్రస్తుతం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌గా సర్పరాజ్‌ అహ్మద్‌ ‌కొనసాతున్నారు. మెట్రో రైల్‌ ‌ప్రాజెక్టుల నిర్వహణ, విస్తరణ పనులు వేగవంతం చేయడంతో పాటు పరిపాలనా వ్యవహారాల్లో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ నియామకం దోహదపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *