ఉద్యోగాలు పొందడానికి నైపుణ్యాలు అవసరం

– వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
– ‘కిట్స్ ’లో ఉత్సాహంగా జాతీయస్థాయి ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్’

వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 27 : ఉద్యోగావకాశాలు పొందడానికి నైపుణ్యాలు, అభ్యర్థి వైఖరి, గేమ్స్ వంటివి ముఖ్యమైన కీలక అంశాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు పేర్కొన్నారు. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్ వరంగల్)లో వరంగల్ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కిట్స్’ అదనపు కార్యదర్శి(ఇన్‌చార్జి కార్యదర్శి) వొడితల సతీష్ కుమార్, స్కిల్ ఇండియా తెలంగాణ డైరెక్టర్ కపిలవాయి దిలీప్ కుమార్, ఇతర ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారి ఉజ్వల భవిష్యత్తుకు దోహదప&తాయన్నారు. మీ జీవితంలో విజయానికి ఉత్సాహభరితమైన ఆరంభమే మొదటి మెట్టు అన్నారు. యువత మాదకద్రవ్యాలు వంటి వాటికి అలవాటు పడకుండా సరికొత్త సాంకేతికతలను ఆస్వాదించాలని, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం సృజనాత్మక, భావప్రసారత, ఏఐతో సహకార నైపుణ్యాలు, మంచి వైఖరిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఒక విద్యా కేంద్రమని అన్నారు. యువత మంచి పరిజ్ఞానంతోపాటు నైపుణ్య ఆధారిత డిగ్రీని పొందాలని సూచించారు. అంకితభావంతో పనిచేసే స్వీయ ప్రేరణే విజయానికి కీలకం అని తెలిపారు. యువతలో సేవాభావం కొరవడిందన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు, శిక్షణ పొందడం కోసం అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమ ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో 101 కంపెనీలు పాల్గొనగా 6,000 ఉద్యోగ నియామకాలు జరిగాయి. నాణ్యమైన విద్యను అందించేందుకు కిట్స్ వరంగల్‌లో నైపుణ్యం, సామర్థ్యాల ఆధారిత పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టారు. వోడితల సతీష్ కుమార్ అధ్యక్షోపన్యాసం చేశారు. సానుకూల దృక్పథం, మానవతా దృక్పథం నాయకత్వ నైపుణ్యాలను పెంపొందిస్తాయన్నారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మన విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతమైనవారిగా, నైతికంగా బలమైనవారిగా తీర్చిదిద్దడానికి ‘కిట్స్’ కృషి చేస్తున్నదన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి చెందిన కౌశల్ భారత్/వికసిత్ భారత్ కార్యక్రమాలలో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. నైపుణ్యాలను వేడుకగా జరుపుకోవడం, యువతను సాధికారతతో తీర్చిదిద్దడం, ఉజ్వల భవిష్యత్తును నిర్మించడం అనేది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వీఎస్ అరవింద్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ప్రొఫెసర్ కురపాటి వెంకట నారాయణ, మాజీ ఎంపీ ప్రొఫెసర్ టి.సీతారాం నాయక్, ఓయూ మాజీ లా డీన్ గాలి వినోద్ కుమార్, యూబీఐ చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి తదితరులతోపాటు రాష్ట్రం నలుమూలల నుండి 7,000 మందికి పైగా యవత పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *