భారత్‌కు ట్రంప్‌ ‌కృతజ్ఞతలు ‌

– హైదరాబాద్‌లో డొనాల్డ్ ‌ట్రంప్‌ అవెన్యూ ఏర్పాటు చేసినందుకు..

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : నగరంలో తన పేరుతో యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. శనివారం ఉదయం తన ‘ట్రూత’ ఖాతాలో ‘భారత దేశంలోని హైదరాబాద్‌లో కొత్తగా డొనాల్డ్ ట్రంప్ అవెన్యూను ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవం పొందిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే. ధన్యవాదాలు – ప్రెసిడెంట్ డొనాల్డ్ జే.ట్రంప’ అని సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 23న హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్‌లో జరిగిన అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రహదారి నామఫలకాన్ని అమెరికా రాయబారి సెర్జియో గోర్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌ల సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించిన సంగతి విదితమే. అమెరికాకు చెందిన కీలక టెక్‌ ‌కంపెనీలు అయిన మైక్రోసాప్ట్, ‌గూగుల్‌, అమెజాన్‌లు ఈ రోడ్డుకు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ పేరు మార్పును భారత్‌-అమెరికా సంబంధాలకు గుర్తింపుగా, అలాగే హైదరాబాద్‌ అం‌తర్జాతీయ సాంకేతిక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో తీసుకున్న ప్రతీకాత్మక నిర్ణయంగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు ట్రంప్‌

వాషింగ్టన్‌,‌జూన్‌ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు. ట్రంప్‌ ‌భారత్‌ ‌పర్యటన కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని, ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు వచ్చి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తానని తెలిపారు. వైట్‌ ‌హౌస్‌లో ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుబియో మాట్లాడారు. భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు అద్భుతమంటూ కొనియాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌ ‌మొదటి భారత పర్యటన ఇదే కానుంది. అమెరికాకు భారత్‌ అత్యంత సన్నిహిత భాగస్వామి అని, ప్రధాని నరేంద్ర మోదీ- ట్రంప్‌ ‌మధ్య మంచి అనుబంధం ఉందని మార్కో రూబియో తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో వాణిజ్య ఒప్పందం గురించి మోదీ-ట్రంప్‌ ‌చర్చించారని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు త్వరలో పూర్తి కానున్నట్లు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని రుబియో తెలిపారు. దీనివల్ల భారత్‌-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారుఇంధన సరఫరాను పెంచడానికి భారత్‌-అమెరికా కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్నారు. చమురు శుద్ధి చేయగల సామర్థ్యం ఉన్న కొన్ని దేశాలలో భారత్‌ ‌కూడా ఒకటని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై రూబియో ప్రశంసలు కురిపించారు. తాను ఆయనకు అభిమానినని తెలిపారు. ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోదీ భారత్‌ను ఒక ప్రపంచ శక్తిగా మార్చారని కొనియాడారు. ’వచ్చే ఏడాది ప్రారంభంలో అధ్యక్షుడు ట్రంప్‌, ‌భారత్‌ ‌పర్యటనకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే మా లక్ష్యం’ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ ‌మధ్య ఉన్న స్నేహం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే . అలాగే క్వాడ్‌ ‌దేశాల నేతల సమావేశం కూడా త్వరలో నిర్వహించాలని అమెరికా ఎదురుచూస్తోందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *