-వందతులను నమ్మొద్దని విద్యార్థులకు వినతి
– 21న రీ టెస్టు కోసం ఏర్పాట్లు పూర్తి: ఎన్‌టిఎ
న్యూదిల్లీ, జూన్ 18: ‘నీట్’-యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఎన్‌టిఎ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి.. పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రీటెస్టు ఉంటుందని.. పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను, సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ‘ఎక్స్’ వేదికగా సందేశం విడుదల చేసింది. ఎన్‌టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది. మరోవైపు.. పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మే 3నాటి పరీక్షను రద్దు చేశాం. ఈ వ్యవహారం నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా పక్రియను మరింత బలోపేతం చేశాం. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ’మానస్’ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ నంబర్‌ను (14416) సంప్రదించి సాయం కోరవచ్చని ఎన్‌టీఏ సూచించింది.పరీక్షకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే సిద్ధమయ్యారు.. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. బాగా విశ్రాంతి తీసుకోండి. నుంచి ఇదే కోరుకుంటున్నాం అని అభ్యర్థులను ఉద్దేశించి ఎన్‌టీఏ పేర్కొంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడ. విద్యార్థులను ప్రశాంతంగా ఉంచాలని, ధ్రువీకరించని సమాచారాన్ని వారితో షేర్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.