రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న మంత్రి
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ములుగు మండలం ఇచ్చర్ల గ్రామానికి చెందిన రైతు జలాల్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. 250 క్వింటాళ్ల వడ్లను జలాల్ పండించారు. జలాల్ రైతులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని మంత్రి కొనియాడారు. ప్రజా ప్రభుత్వం అన్నదాతకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈసందర్భంగా రైతు జలాల్ కనీస మద్దతు ధరతో పాటు లక్ష పదివేల రూపాయల బోనస్ అందడంతో హర్షం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు బోనస్ ప్రకటించి వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపాడు.




