బీఆర్ ఎస్ అధినేత దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయంలో దురదృష్టవశాత్తూ నీట మునిగి 5 గురు యువకులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
హైద్రాబాద్ నుండి వచ్చిన యువకులు ఈత రాకపోవడం వల్ల నిండుగా వున్న జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని తన సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *