– స్టీల్ లిక్విడ్ పడి మంటలు
– 9మంది కార్మికుల దుర్మరణం
– ఏడుగురికి తీవ్ర గాయాలు
– మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం
– ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఘటనపై ఆరా
– హుటాహుటిన విశాఖకు హోంమంత్రి అనిత
విశాఖపట్నం, జూన్ 8 : విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ ని ఎస్ఎంఎస్-2, ఎన్టీసీ-3 హీట్ ఎఫీలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1,500 డిగ్రీల వేడితో లిక్వి డ్ ల్యాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిపమాక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు యత్ని స్తున్నారు. మెటల్ ల్యాడల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. ల్యాడల్లో ఉన్న ద్రవ లోహం అకస్మాత్తుగా కిందపడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనలో ప్రమాదస్థలిలో 9 మంది కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్య వసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సప ఆస్పత్రులకు తరలిం చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ల్యాడల్ లోని ద్రవ లోహం ఎందుకు కిందపడింది.. సాంకేతిక లోపమా.. లేక భద్రతా ప్రమాణాల్లో ఏవైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అధికారిక నివేదిక వచ్చిన తర్వాతే గాయపడిన వారి సంఖ్య, మరణాల వివరాలు, ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాల ని ఆదేశించారు. అలాగే అన్నిశాఖలు సమ న్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ప్రమాదంపై వెంటనే స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసు కున్నారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి : మంత్రి కిషన్ రెడ్డి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్న ఆయన మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్లాంట్ లోపల చిక్కుకుపోయిన |త్రŸతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న కార్మికులకు అత్యుత్తమ, అత్యవసర వైద్య సేవలు అందించాలన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్