హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో ఆయన స్టేట్‌మెంట్‌ను ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి ఇంటికి వెళ్లి ఆయన వినియోగించిన నంబర్ చూపి వివరాలు, స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు.
సిట్ విచారణకు ఎంపీ అనిల్ కుమార్ హాజరు
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ‘సిట్’ జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో శనివారం సుదీర్ఘంగా విచారించింది. గత ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్లు గుర్తించిన పోలీసులు ఇందుకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను ఆయన ముందు ఉంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఏయే రోజుల్లో, ఏ సమయాల్లో ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారనే వివరాలను అధికారులు ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఇదే కేసులో అనిల్ తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ నిర్దారించింది. అయితే ఆయన వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేరుగా వారి ఇంటికే వెళ్లి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. విచారణ అనంతరం ఎంపీ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ అత్యంత నీచ రాజకీయాలకు పాల్పడింది.. నా ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించి నన్ను విచారణకు పిలిచారు. .ఏ రోజు, ఏ టైమ్‌కు ట్యాపింగ్ జరిగిందో కొన్ని కీలక ఆధారాలను నా ముందు ఉంచి వివరాలు అడిగారు.. అప్పట్లో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. అయితే ఏదైనా కార్యక్రమం తలపెట్టి గడప దాటకముందే తమ ఇంటి ముందు పోలీసులు వాలిపోయేవారు.. మాకు అప్పట్లో అర్థం కాలేదు.. ప్లాన్ చేసుకున్న విషయాలు పోలీసులకు ఎలా తెలుస్తున్నాయా అని ఆశ్చర్యపోయేవాళ్లం. ఇప్పుడు ‘సిట్’ ఆధారాలు చూపిస్తుంటే అసలు విషయం అర్థమైంది’ అని చెప్పారు. తన తండ్రి అంజన్ కుమార్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు. ఆయన స్టేట్‌మెంట్ తీసుకోవడానికి అధికారులు ఇంటికి వస్తామని చెప్పారని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





