– కేసు లేకున్నా నామినేషన్ తిరస్కరణ : మహేశ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ నటరాజన్‌పై కేసు ఏమీ లేదని, నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ కుట్రకు పూనుకున్నదని ఆరోపించారు. గాంధేయవాది, నిజాయతీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం కల్పించుకుని కేసును తప్ప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదన్నారు. బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 24 గంటల్లో ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం విచారకరమని అన్నారు. మీనాక్షిని బలి చేశారని, ఆమె విషయంలో కొంతమంది బీజేపీ నేతలు సానుభూతి తెలిపినట్లు తెలిసిందని మహేశ్ అన్నారు. లీకు వీరులు.. గ్రీకు వీరులు ఉంటే సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంతమాత్రాన కుట్రకు పాల్పడరాదని అన్నారు. ఓటు చోరీ చేసి ఇప్ప్పుడు సీటు చోరీ చేశారంటూ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





