కొడంగల్‌లో 33వేల డూప్లికేట్‌ ‌ఓట్లు

– రేవంత్‌ ‌గెలిచింది ఆ ఓట్లతోనే
– టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత 

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌దేశంలో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ‘సర్‌’ ‌జరిగిందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్‌ ‌నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని, ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో కవిత సోమవారం మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు రెండుచోట్ల ఓట్లు ఉండ‌గా వీటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని ప్రస్తావించారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొండగల్‌లో 800 ఓట్లు మాత్రమే తొలగించారని, తాము వెరిఫై చేస్తే 33వేల డూప్లికేట్‌ ‌ఓట్లు ఉన్నాయని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి 32వేల మెజారిటీతో గెలిచారని, ఈ డూప్లికేట్‌ ‌ఓట్లతోనే గెలిచారని తమకు అనుమానం ఉందని అన్నారు. రాష్ట్రంలో డూప్లికేట్‌ ‌ఓట్లు చాలా ఉన్నాయని తెలిపారు. కర్ణాటక నుంచి నోటు ట్రాన్స్‌ఫర్‌తోపాటు ఓటు ట్రాన్స్‌ఫర్‌ అయిందా అనే అనుమానం కలుగుతోందని కవిత పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ’సర్‌’ ‌దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్టాల్ర మధ్య ఉన్న డేటాను వెంటనే పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు ఏపీలో కూడా ఓటు ఉందని, ఒకచోట మాత్రమే ఓటు ఉండేలా చూడాలని సూచించారు. ఇంటర్‌ ‌స్టేట్‌ ‌డూప్లికేట్‌ ‌ ఓట్లను తొలగించాలన్నారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామనన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *