Day May 20, 2026

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి

– పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : ఉపాధి హామీ పథకం కింద వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం…

భారత్-యూరప్ నైపుణ్య భాగస్వామ్యం బలోపేతం

– నైపుణ్య ఉద్యోగాలకు యువతను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం – కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి తెలిపారు. టామ్‌కామ్‌ను మరింత బలోపేతం చేసేందుకు…

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో హైగ్రేడ్ గంజాయి భారీగా పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) అధికారులు గుర్తించారు. నిందితులు విమానం దిగిన వెంటనే డీఆర్ఎ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని…

మెడికల్ షాపుల బంద్ విజయవంతం

హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 20: ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజయవంతమైంది. ఈ మేరకు మెడికల్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్…

అత్తాపూర్ యువతి కిడ్నాప్ కేసు సుఖాంతం

– ఛేజ్ చేయడంతో పారిపోయిన దుండుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే20: అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్ ఉన్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ జోయ్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అవడం…

స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి

-ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ హైదరాబాద్,ప్రజాతంత్ర, మే20: రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు జూన్ లో పునఃప్రా రంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని…

బజార్ హత్నూర్ లో జొన్న రైతుల ఆందోళన

– సకాలంలో కొనుగోళ్లు లేక రోజుకోచోట ధర్నాలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మే 20: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొన్ని రోజులుగా జొన్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తాజాగా బజా ర్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా జొన్న…

బైక్ ను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 20: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా, మృతులను చందుపట్ల గ్రామానికి చెందిన జమ్మల లక్ష్మీకాంత్, సంగారెడ్డికి…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు – కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని సీఎస్‌కు సీఎం ఆదేశాలు హైదరాబద్, ప్రజాతంత్ర, మే 20 : తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ…