-ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే20: రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు జూన్ లో పునఃప్రా రంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, ఇతర వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలు, అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కిం చుకొని నడుపుతున్న వాహనాలు, భద్రతా ప్రమాణాలు పాటించని వాహ నాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండాలని సూచించారు. వాహనాలలో అనుమతించిన సామర్ధ్యానికి మించి విద్యార్థులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ర్ ఎక్సిటింగ్విషర్, ఎమర్గ్+న్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాలు, విద్యార్థుల భద్రత కోసం అటెండర్ను నియమించాలన్నారు. ఫిట్నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేస్తామన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని తల్లిదండ్రులకు రవాణా శాఖ సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



