– సకాలంలో కొనుగోళ్లు లేక రోజుకోచోట ధర్నాలు
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మే 20: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కొన్ని రోజులుగా జొన్న రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. తాజాగా బజా ర్ హత్నూర్ మండల కేంద్రంలో జొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా జొన్న కొనుగోలు చేసి వారం గడిచినా కూడా లోడింగ్ చేయకపోవడంతో వర్షానికి మొక్కజొన్న సంచులు తడిసిపోయా యని ఆందోళన వ్యక్తం చేశారు. జొన్న పంట ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డి ప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజే శారు. ఇదిలావుంటే ఆదిలాబాద్ జిల్లాలో జొ న్న రైతులను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉ న్నాయి. యాసంగిలో పండిన జొన్నల కో నుగోళ్లను ప్రభుత్వం ఆలస్యంగా చేపట్టింది. దీంతో పక్షం రోజులుగా అమ్మకునేందుకు అవకాశం లేకుండా పోయింది. పొ లాల్లోనే జొన్నలను నిల్వచేసి రాత్రి, పగ లు కాపల ఉం టున్నారు. అదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించిన ఐదు రోజులవరకు కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో వర్షానికి పంట తడిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదవుతుండగా ఎండలు మండిపోతున్నా యి. షెడ్యూల్ ప్రకారం పంటను సేకరిస్తామని ప్రకటించిన అధికారులు కొనుగోళ్లను తరచూ వాయిదా వేస్తున్నారు.
వాయిదా అనంతరం ఈ నెల 14న కొనుగోళ్లను ప్రారంభించిన పీఏ సీఎస్ సిబ్బంది ఐదు రోజులపాటు కొనుగోలు చేసి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటిం చారు. మార్కెట్ యార్డులో పంట నిల్వలు పేరుకపోవడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి కొనుగోళ్లను ఎప్పుడు ప్రారం భిస్తామని విషయం చెప్పకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతుల వద్ద సేకరించిన జొన్న పంటను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం జరుగుతున్నది. జొన్నల కొనుగోళ్లపై కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావే శాలు నిర్వహించి అమ్మకాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో వేల క్వింటాళ్ల జొన్నలను కాంటా వేసి సంచుల్లో నింపిన లారీలు, హమాలీల కొరత కారణంగా గోదాముల్లోకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతుల పంటను కాంటా చేసిన పీఏసీఎస్ సిబ్బంది వారికి కొనుగోళ్ల పత్రాలు ఇవ్వడం లేదు.సంచుల్లో నింపిన జొన్నలు లారీల్లో లోడ్ చేసిన తర్వాత వివరాల పత్రాలు ఇస్తామని, అప్పటి వరకు ఉండాలని సూచిస్తున్నారు. దీంతో రైతులు వారం రోజులుగా మార్కెట్ యార్డులోని సంచుల వద్ద రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. రోజుకు ఎనిమిది లారీలు వస్తున్నాయని, ఐదు వేల సంచులు మాత్రమే రవాణా చేస్తున్నారని రైతులు తెలిపారు. రెండు రోజులుగా మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో ఎప్పుడు వర్షం పడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



