ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

– అసెంబ్లీలో బోనాలు.. పాల్గొన్న స్పీకర్, మండలి చైర్మన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లు ఆకాంక్షించారు. శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ శుక్రవారం ఘనంగా జరిగింది. తొలుత లెజిస్లేటివ్ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా స్పీకర్, మండలి చైర్మన్‌లు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పూజల్లో పాల్గొన్న ప్రముఖులకు ఆలయ పూజారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఉద్యోగులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *