అతుక్కున్న రెండు కిడ్నీలకు అరుదైన శస్త్రచికిత్స

– శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో 12 ఏళ్ల బాలుడికి పునర్జన్మ

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అతుక్కు ని ఉన్న రెండు కిడ్నీలను వేరుచేస్తూ 12 ఏళ్ల బాలుడికి అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను హనుమకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. హాస్పటల్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ. రాంప్రసాద్ రెడ్డి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడిస్తూ.. మేడ్చల్ జిల్లా కాప్రాకు చెందిన సబ్బాని పూర్ణచంద్ర (12) అనే బాలుడికి ఎడమ కిడ్నీ కుడి వైపునకు జరిగి, రెండు కిడ్నీలు అతుక్కుని పనిచేయకపోవడమే కాకుండా తీవ్ర ఇన్ఫెక్షన్ రావడం తో ఆసుపత్రిలో చేరాడన్నారు. వైద్య పరిభా షలో దీనిని ‘లెఫ్ట్ టు రైట్ క్రాస్డ్ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ’గా పిలుస్తారని తెలిపారు. రెండు కిడ్నీలు ఒకేవైపు అతుక్కుని ఉండటం వల్ల ఆరోగ్యంగా పనిచేసే కిడ్నీ రక్తనాళాలు, మూత్రనాళాలు పక్కపక్కనే ఉంటాయని, అత్యంత నైపుణ్యంతో లాప్రోస్కోపిక్ పద్ధతి లో రెండు గంటల 30 నిమిషాల పాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆపరేషన్ పూర్తి చేశామని వివరించారు. ఈనెల 3న చేప ట్టిన ఈ సర్జరీ అనంతరం బాలుడు పూర్తిగా కోలుకోవడంతో 72 గంటల్లోనే ఆరోగ్యంగా డిస్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రిజ్వాన్, డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నారు. బాలుడికి పునర్జన్మ ప్రసాదిం చిన వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *