మూడేళ్లు గ‌డుస్తున్నా అమ‌లుకాని పీఆర్‌సీ

– షేర్ అమౌంట్ చెల్లిస్తున్నా ప‌నిచేయ‌ని హెల్త్‌కార్డులు
– చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 డీఏలు పెండింగ్..
– సర్కార్‌పై డీటీఎఫ్ ఫైర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :  పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు కావస్తున్నా సకాలంలో అమలు చేయక‌పోడంతో ఉపాధ్యాయ, ఉద్యోగు లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని డెమోక్ర టిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల  సమ స్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవన్‌లో డీటీఎఫ్ 16వ రాష్ట్ర వార్షిక కౌన్సిల్ సమావేశం సోమయ్య అధ్యక్షతన శనివారం జరిగింది. విద్యారంగ, ఉపాధ్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కార్యదర్శి నివేదికను లింగారెడ్డి  ప్రవేశపెట్టారు. అనంతరం సోమయ్య, లింగారెడ్డి మాట్లాడుతూ  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రతి నెలా వేతన మినహాయింపు చేస్తున్నప్పటికీ హెల్త్ కార్డులు పనిచేయడం లేదని, చాలాకాలంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల,పెన్షనర్ల బిల్లులు వం దలాది, రూవేలాది కోట్లు పెండింగ్‌లో ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ, విద్యారంగానికి బడ్జెట్ లో కనీసం 15% నిధులు కేటాయించాలన్నారు. సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం.గంగాధర్ 1999 ఫిబ్రవరి నుంచి 2026 ఆగస్టు వరకు అధ్యాపక జ్వాల పత్రికలను డిజిటల్ రూపంలోకి మార్చిన వెబ్‌సైట్ లింక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ రోజురోజుకు విద్యారంగ ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ పెరిగి పోతున్నదని, ప్రభుత్వ విద్యారంగం కుచించుకుపోతున్నదన్నారు. ప్రభుత్వ  విద్యారంగంలో రోజు రోజుకు స్వచ్ఛంద సంస్థల జోక్యం పెరుగుతున్నదని, తద్వారా ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదికి దూ రం చేయబడుతున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శాంతన్, వి.రాజిరెడ్డి, బి.రేణుక, టి.శ్రీశైలం, చాప బాబు దొర, ఎం.సామ్యూల్, జె.రామస్వా మి, ఎ.శ్రీనివాసరెడ్డి, బి.శ్యామ్, ఆర్.లింగయ్య, డిటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్ రెడ్డి, కె.నారాయణ రెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, అకడమిక్ సెల్ కన్వీనర్ డా.బి.రామకృష్ణ, సభ్యులు సృజన, అధ్యాపక జ్వాల సంపాదకవర్గ సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి,డా.జి.కళావతి, అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *